For Advertisement Enquiries Please Contact +91 7901268899

డాలర్ పంటకు ఊరట

img

డాలర్ పంటగా పెరొందినా ఆక్వా పరిశ్రమలో నాటి కాంతులు దూరమయ్యాయి . వ్యాధుల తాకిడి ..... ధరలు పతనం లాంటి కారణాలతో ఈ పరిశ్రమ ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కొంటుంది.దిన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది . విద్యుతు బిల్లులో రాయితీ ప్రకటించింది . రైతులు బిల్లులు నేరుగా విద్యుత్తు శాఖకు చెల్లిస్తే  అందులో 42 శాతం తిరిగి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు శ్రీకారం చుట్టింది ... ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతుకి ఇది ఊరట కలిగించే అంశమే ..
జిల్లాలో వేటపాలెం , చినగంజాంతో పాటు తీర ప్రాంతంలో కొంతమేర సాగవుతోంది . నాయునిపల్లి , పందిళ్లపల్లి , బచ్చల వారి పాలెం తదితర ప్రాంతాల్లో ఆక్వా చెరువులను రైతులు సాగు చేస్తున్నారు.ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈ ప్రాంతాల్లో  200 వరకు విద్యుత్తు సర్విసులున్నాయి. వీటి ద్వారా విద్యుత్తు శాఖకు ప్రతి నెలా రూ.68  లక్షల ఆదాయం వస్తోంది . ప్రస్తుతం ఆక్వా  విద్యుత్తు యూనిట్ కి రూ.3 .86 పైసల వంతున రైతులు చెల్లిస్తున్నారు .ప్రభుత్వం ఈ పరిశ్రమను ఆదుకునే లక్ష్యం తో వీరు చెల్లిస్తున్న విద్యుత్తు బిల్లులో యూనిట్ కి రూ. 2 లకు తగ్గించింది. అంటే ప్రతి రైతుకు రూ. 1 .86 ల రాయితీకి  ప్రకటించింది. దీని బట్టి చూస్తే సుమారు 42 శాతం రైతుకి ఆదా అవుతోంది . విద్యుత్తు బిల్లులను యధావిధిగా ఆ శాఖకు రైతులు చెల్లించాలి . ప్రభుత్వం ప్రకటించినా రాయితి సొమ్మును తిరిగి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు ప్రకటించింది . ఇప్పటి వరకు నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా రైతుకి ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రకటించిన విద్యుత్తు రాయితీ ఎంతగానో ఉపయోగపడనుంది వారు పేర్కొంటున్నారు.   

Languages

Shares

Related News