రైతన్నలకు ఆక్వా పంట ఆదుకుంటోంది . తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న చినగంజాం పరిసర ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తున్నారు.రొపేరు కట్టు ప్రాంతం , చినగంజాం మండల పరిధిలో సుమారు 5 వేల ఎకరాల్లో పంట వేశారు. ఎక్కువ భాగం రొపేరు కాలువ ఆయకట్టులో ఉంది . ఈ ప్రాంతానికి బంగాళాఖాతం ఆరేడు కిలోమీటర్లు దూరంలో ఉంది . ఈ చెరువులకు భూగర్భ జలాలనే వినియోగిస్తున్నారు. ప్రతి చెరువు వద్ద విధ్యుత్ బోర్లు సాయంతో నీటిని మళ్లిస్తున్నారు. ఇటీవల ధరలు కొంత అశాజనకంగా ఉన్నాయి. కిలో కు 100 కౌంటు వచ్చి రూ. 230 ఉంటోంది. దిగుబడి బాగా ఉంటే రైతన్నలు లాభాలు చవిచూసే అవకాశం ఉంది.
వృధా నీటిని రొంపేరులోకి మళ్లించి:
చెరువుల్లోని వృధా నీటీని కాలువల ద్వారా రొంపేరులోకి పంపుతున్నారు.స్ రొపేరు నుంచి సముద్రంలోకి వెళుతుంది. అటూపోట్లు సమయంలో రోజూ రొంపేరు కాలువలోని తేటగా ఉండే స్వచ్చమైన నీరు వస్తుంది. పారుదలకు అనుకూలంగా ఉంది. ఇటీవల రొంపేరు కాలువను ఆధునీకరించారు. దీంతో చెరువుల్లోని వృధా నీరు ఎప్పటికప్పుడు అటూపోటుల వల్ల సులభంగా సముద్రం లో వెళుతుండటం అన్న దాతలకు ఉపకరిస్తోంది చెరువుల్లోని రొయ్యలకు హాని కల్గించే క్రిము కీటకాలు రొంపేరు కాలువ ద్వార సముద్రంలోకి వెళుతుంటాయి . దీని వల్ల క్రిమి సంహారక మందుల ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఇలా ఈ ప్రాంతంలో ఆక్వా విస్తిరిస్తోంది.
భారీగా లీజులు
ఎకరం భూమి లీజు ఏడాదికి రూ.1.10 లక్షలు ఉంది. ఇతర ప్రాంతాల్లో ఇక్కడి కంటే లీజు రేట్లు తక్కువగా ఉన్నాయి. రొంపేరు కాలువ పరిధిలోని రైతుల్లో ఎక్కువ మంది లాభాల బాటలోనే ఉన్నారు. వ్యవసాయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రైతన్నలు ఆక్వా పుంజుకోవడంతో గట్టెక్కుతున్నారు.
Source: ennadu