For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఆక్వా ఆక్రందన పట్టదా

img


రాష్ట్రంలో అడ్డగోలుగా ఆక్వా సాగును ప్రోత్సహించి ప్రోఫెసర్ల కమిటీ నివేదికను తొక్కి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తామంటూ మాటలు మాత్రం చెబుతోంది.యాంటిబయోటిక్స్ వినియోగాన్ని తనిఖీ చేసేందుకు  ఇన్నాళ్ల తరువాత తాపీగా టాస్క్ ఫోర్స్ , ఆపెక్స్  కమిటీలను నియమించటంపై ఆక్వా రంగ నిపుణులు , సాగుదారులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగానేచిత్తశుద్ది ఉంటే ఆక్వా సాగుపై ఆంధ్రా యూనివర్శిటీ ప్రోపెసర్ల కమిటీ సమర్పించిన  నివేదికను ఎందుకు బయటపెట్టలేదని నిలదీస్తున్నారు.
మత్య్స శాఖ కే సమాచారం లేదు..
ఆంద్రప్రదేశ్ ను ఆక్వాహబ్ గా మారుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వ2015 లో మత్స్య విధానాన్ని ప్రకటించింది  ప్రస్తుత్తం ఏటా22 లక్షల టన్నులదిగుబడి ఉన్న మత్స్య ఉత్పత్తిని 2019 -20 నాటికి రెట్టింపు చేయాలన్నది  లక్ష్యం. రొయ్యల సాగు లాభసాటిగా ఉండటంతో వనామి రొయ్యల సాగులో దేశంలో ఆంధ్రప్రదేశ్  మొదటి స్ధానంలో ఉంది.  రాష్ట్రంలో 7 లక్షల ఎకరాలకు పైగా ఆక్వా సాగవుతోంది.కృష్టా , ఉభయ గోదావరి జిల్లాల్లో మాగాణి భూములను చేపల చెరువులుగామార్చి నిభంధనలకు విరుద్ధంగా వ్యర్ధాలను విడుదల చేయటంతో గ్రామాలు కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు  ఆంధ్రా యూనివర్శిటీ ప్రోపెసర్ల కమిటీ సమర్పించిన 13 పేజీల నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదు. సర్టిఫైడ్ వనామీ రొయ్య పిల్లల్నిహేచరీస్ నుంచి మాత్రమేకొనుగోలు చేయాలన్న నిబంధన అమలు కావటం లేదనికమిటీ నివేదికలో పేర్కొంది..రాష్ట్రంలో సర్టిఫైడ్ హేచరీస్ చాలా స్వల్పంగా ఉండటంతోరైతులు అనధికారికంగా కొనుగోలు చేసి సాసు చేస్తున్నారు. సర్టిఫైడ్ హేచరీస్ ఎక్కడున్నాయో, ఎన్ని ఉన్నాయో కూడా రాష్ట్ర మత్స్య శాఖ వద్ద సమాచారం లేకపోవడం విచిత్రం.
అవి ఇక కొరగాని భూములే..
 విచ్చలవిడిగా భూగర్భ జలాల వినియోగం , వ్యర్ధ జలాల విడుదల , సముద్ర జలాలను ఆక్వా చెరువుల్లోకి  పంపడం వల్ల డ్రైన్లు , పంట కాల్వలన్నీ  ఉప్పిరిసిపోతున్నాయి.మంచి నీటి పొరలు కలుషితమవుతున్నాయి. 7 నుంచి 12 ఏళు పాటు వనామీ రొయ్యల సాగు చేసిన చెరువులు  ఆ తర్వాత ఎందుకూ  కొరగాకుండా పోతాయి. వాటీల్లో మళ్లీ ఏదైనా పండించాలంటే కనీసం 6 నుంచి 7 ఏళ్లు పడుతుందని ప్రోపెసర్ల కమిటీ పేర్కొంది.
ప్రోపెసర్ల కమిటీ సిఫార్సులు ఇవీ...
1 . విచక్షణారహితంగా జరుగుతున్నరొయ్యల సాగును నియంత్రించాలి.
2. కోస్తా ప్రాంతాన్ని  ఉప్పు నీటి సాంద్రత ఆధారంగా జోన్లుగా విభజించాలి. ఆక్వా కల్చర్ , వ్యవసాయానికి పనికి వచ్చే జోన్లను గుర్తించాలి.
3. వనామీ సాగుకు పనికి వచ్చే జోన్లలో పూర్తి సామర్ధ్యంతో రొయ్యల్ని పెంచాలి. వనామీ రొయ్యల సాగుపై మార్గదర్శకాలను సంస్కరించి శాస్ర్తీయ పద్దతిలో ఆక్వాసాగు చేసే నిభంధన విధించాలి. 
4. భూగర్భ జలవనరులు , వ్యవసాయ భూములకు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలి.
Source :sakshi

Languages

Shares

Related News