ఢిల్లీ : అసంఘటితంగా ఉన్న మత్స్య రంగాన్ని సంఘటితం చేయడంతో పాటు చిన్న , సూక్ష్మ పరిశ్రమలు సంస్థాగత ఆర్ధిక .6000 కోట్ల పధకానికి కేంద్ర మంత్రి వర్గం గురువారం ఆమోదం తెలిపింది . చేపల సాగు రంగానికి బీమా కోసం కూడా ఈ నిధులను వెచ్చిస్తారు .మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని 2025 -2026 బి వరకు పొడిగించడానికి క్యాబినెట్ అంగీకరించింది .ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గం సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకుంది .మత్స్య కారులు ,మత్స్య కార్మికులు చేపల రైతులకు ఉపయోగ పడేలా ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనసహయోజనకు క్యాబినెట్ ఆమోదించిందని సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు .ఈ పధకానికి సగం డబ్బు ప్రపంచ బ్యాంక్ , ప్రభుత్వ సంస్థలు సమకూరుస్తామని చెప్పారు .ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనకు అనుబంధ పధకంలా ఇది ఉంటుంది . దీని వల్ల 1.7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి .6.4 లక్షల చిన్న చిన్న వ్యాపారవేత్తలకు 5500 మత్స్య కారుల సొసైటి రుణాలు లభిస్తాయి వ్యాధుల వల్ల చేపల చెరువుకు భీమా కవచం లా పనిచేస్తుంది . విలువ జోడించడం ద్వారా ఎగుమతుల్లో పోటీ పెరుగుతుంది . దేశీయంగాను నాణ్యమైన చేపలు లభ్యమౌతాయని తెలిపారు .