For Advertisement Enquiries Please Contact +91 7901268899

సేంద్రియ ఆక్వా సాగుకు ఎంపెడా సమాయత్తం

img

చేపలు, రొయ్యలు సాగులో సేంద్రియ పద్దతులను ప్రోత్సహించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్ధ సమాయత్తమవుతున్నది. సేంద్రియ ఆక్వా సాగులో ఖర్చు పెరుగుతుంది. కాబట్టి సాధారణంగా ఆక్వా రైతులు వెనుకడుగు వేస్తుంటారు. అయితే , సేంద్రియ ఆక్వా ఉత్పత్తులకు 15 శాతం అధిక ధర చెల్లించి కొనుగోలు చేయడానికి విదేశీ సంస్ధలు ముందుకొస్తున్నందున ఇక మీదట ఆ ఇబ్బంది ఉండబోదని ఎంపెడా చైర్మన్ ఎ. జయతిలక్ అంటున్నారు. స్విట్జర్లాండ్ కు చెందిన అతిపెద్ద వినియోగదారుల సహకార సంస్ధ  ‘కూప్ కో – ఆపరేటివ్ ‘ కు అత్యంత నాణ్యమైన సేంద్రియ ఆక్వాసాగు,అంతర్జాతీయ సేంద్రియ ఆక్వా సర్టిఫికేషన్ పద్దతులు తదితర అంశాల్లో పాతికేళ్ల అనుభవం ఉంది. గోవాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సీపుడ్ షో – 2018 లో కూప్ కో – ఆపరేటివ్ తో ‘ ఎంపెడా’ అవగాహన కుదుర్చుకుంది.దేశీయంగా ఆక్వా సంస్ధలు , రైతులతో సేంద్రియ ఆక్వా సాగు చేయించడంతో పాటు 15% అదనపు ధరకు కొనుగోలు చేయడానికి కూప్ కో – ఆపరేటివ్ అంగీకరించిందని ఎంపెడా చైర్మన్ తెలిపారు. సేంద్రియ సాగుకు సీడ్ ను అందించేందుకు హేచరీ ,మేత తయారీ కర్మాగారం, సేంద్రియ సాగు పద్ధతులపై సాంకేతిక సహకారం, శిక్షణ,దేశ ,విదేశీ మార్కెట్లు కోసం సర్టిక్షేషన్, ఒప్పంద కొనుగోళ్లు... వీటన్నింటిలోనూ ఆ సంస్ధ తోడ్పాటును అందించనుంది. వియాత్నాంలో సేంద్రియ ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్న కూప్ కో – ఆపరేటివ్ ... దిగుమతి చేసుకున్నఆక్వా ఉత్పత్తులను స్విట్జర్లాండ్లో తన 2,200 అవుట్ లెట్ల ద్వారావిక్రయిస్తోంది.
Source : sakshi     
 

Languages

Shares

Related News