అమరావతి: ఆక్వాలో రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్ధానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా రూ. 37,871 కోట్ల విలువైన ఆక్వాఉత్పత్తులు ఎగుమతవగా .. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 17,000 కోట్ల విలువైన ఎగుమతులు ఉన్నాయి.
చేపల ఉత్పత్తిలో 23, 52 లక్షల టన్నుల ఉత్పత్తితో రాష్ట్రం 21.9 శాతం వాటా సాఅధించింది. రెండో స్ధానంలో ఉన్న పశిమబంగాల్ 16.71 లక్షల టన్నుల , మూడో స్ధానంలో ఉన్న గుజరాట్ 8.10 లక్షల టన్నులుసాధిస్తున్నాయి.
రొయ్యల ఉత్పత్తి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 60.1 శాతం గా ఉంది. దేశం నుంచి 4.97 లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతవుతుంటే .. అందులో మన రాష్ట్రం నుంచే 3.02 లక్షల టన్నులువివిధ దేశాలకు వెళుతున్నాయి.
రొయ్యల ఉత్పాదకతలో మాత్రం గుజరాత్ హెక్టారుకు 7.51 లక్షల చొప్పున సాధిస్తోంది. . అక్కడ 4,553 హెక్టార్లలోనేసాగు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో హెక్టారుకు 7.05 టన్నులే తీస్తున్నారు. 42,437 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
Source : eenadu