For Advertisement Enquiries Please Contact +91 7901268899

రక్షణ కవచం ....

img

తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది . ఆక్వా ప్రాధికార సంస్ధ ఏర్పాటు చేసి ప్రతి అడుగులోనూ వారి సంక్షేమమే లక్ష్యంగా సాగుతోంది . వారికి రక్షణ కవచంలా నిల్చింది . నాణ్యమైన సీడ్ , ఫీడ్ అందించడంతో పాటు మెరుగైన ధరలు దక్కేలా చూడడం , దళారుల దోపిడీకి చెక్ పెట్టడం వరకు అన్ని దశలోనూ దన్నుగా నిలుస్తోంది .

ఒంగోలు :

మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి చేపలు , రొయ్యలు సాగు అభివృద్ధి కి ప్రాధికార సంస్ధ ను ఏర్పాటు చేశారు .ఆంద్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ ఆధారిటీ యాక్టు 2020 ని తీసుకువచ్చింది . దీంతో నాణ్యమైన సీడ్ , ఫీడ్ అందించడంతో పాటు విక్రయాల్లో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటోంది . ఆక్వా రైతులకు అండదండగా ఆక్వా అధారిటీ నిలిచింది . ఈ చట్టం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ , ఫీడ్ ఇతర ఇన్ పుట్స్ సకాలంలో సరసమైన ధరలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుకున్నాయి .ఆక్వా రైతులు , అనుబంధ పరిశ్రమలకు సులభంగా లైసెన్సులు మంజూరు చేస్తున్నారు . జిల్లాలో 30 శాతం మత్స్య ఉత్పతుల వినియోగం జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించటానికి , మంచి పోషక పదార్ధాలు కలిగిన ఆక్వా ఉత్పత్తులు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిసున్నారు . ప్రాసెసింగ్ , మార్కెటింగ్ రంగాలను మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు . రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ మత్స్య శాఖ సహాయకులు అన్ని రకాలుగా రైతులకు సహాయ సహాయ సహకారాలు అందిసున్నారు .

జిల్లాలో 40 వేల ఎకరాల్లో ఆక్వా సాగు ...

జిల్లాలో అటు ఉప్పు నీటిలోనూ , ఇటు మంచి నీటిలోను దాదాపు 40 వేల ఎకరాలో ఆక్వా సాగు చేపడుతున్నారు . జిల్లాలో 104 కిలో మీటర్ల మేర పది మండలాల్లో వ్యాపించిన సముద్ర తీరంలో దాదాపు 18 నుంచి 20 వేల మంది ఆక్వా రైతులు రొయ్యలు , చేపల సాగు చేస్తున్నారు . ఆక్వా సాగు మీద పడి జలాల్లో దాదాపు పదికి పైగా ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి . వాటి ద్వారా జిల్లాలో సాగైన రొయ్యలను ప్రెసెసింగ్ చేసి కాకినాడ , కృష్ట్ణ పట్నం , చెన్నై పోర్ట్ ల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు . ఆక్వా సాగుతో వేలాది మంది ఉపాధి పొందుతుండగా ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్వాహకుల ప్రయోజనాలకు భంగం కలుగకుండా చర్యలు తీసుకుంటోంది . జిల్లాలో 31 కి పైగా రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీలు ఉన్నాయి . ఆక్వా సాగుకు అనుమతులను కూడా సరళతరం చేసింది . నేరుగా ఆన్ లైన్లలో దరఖాస్తు చేసుకుంటే గ్రామ సచివాలయాల ద్వారా మందా స్థాయి కమిటీలు , చివరగా జిల్లా స్థాయి కమిటీ అనుమతి అనేది సులభంగా ఇచ్చే ఏర్పాట్లు చేశారు .

source : sakshi

Languages

Shares

Related News