For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్యకు వడ దెబ్బ

img

గూడురు : సాధారణంగా జిల్లా తీరం వెంబడి 16 మండలాల్లో దాదాపు 1.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 39 వేల మందికి పైగా అక్కా రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు .రొయ్యలకు అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు ఎకరాకు 4 నుంచి 5 ఏరేటర్స్ వినియోగిస్తున్నారు . ఎండల త్రీవ్రత  ఎక్కువగా ఉండటంతో రొయ్యలకు సరైన ఆక్సిజన్ అందించేందుకు 6 నుంచి 8 ఏరేటర్స్  ఏర్పాటు చేసి రోజుకు 20 గంటలు పాటు తిప్పుతున్నారు . ఈ సారి ఎండా తీవ్రత ను ముందుగానే పసిగట్టిన రైతులు 89 వేల ఎకరాల్లో మాత్రమే రొయ్యల సాగు చేపట్టారు . పూర్తి విస్తీర్ణంలో ఆక్వా సాగు జరిగితే జిల్లా రైతుల నుంచి ఏటా 5.75 లక్షల టన్నుల రొయ్య ఉత్పత్తుల ద్వారా రూ .16 వేల కోట్ల మేర ఆదాయం  వస్తుంది ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఉత్పత్తులు తగ్గి  రూ .13  వేల కోట్లకు ఆదాయం తగ్గిందని పలువురు రైతులు అంటున్నారు .  ప్రస్తుతం జిల్లా అంతటా గడిచిన 14 రోజుల్లో 37 వేల ఎకరాల్లో రొయ్యల హార్వెస్టింగ్ జరుగుతోంది .

సిండికేట్లుగా ఏర్పడి దోచుకుంటున్నారు

తీవ్ర ఉష్ణోగ్రతలతో రొయ్యల వడదెబ్బ తగిలి చనిపోతుండటంతో వాటిని కాపాడుకునే ప్రయత్నంలో రైతులు ఆక్వా టెక్నీషీయాన్ సలహాల మేరకు వివిధ కెమికల్స్ సాగులో అధికంగా వాడుతున్నారు .ఈ క్రమంలో రొయ్యల రంగు మారి ఎలాగోలా బతకి బయటపడుతున్నాయి .అసలే ఇబ్బందుల్లో ఉన్న రైతులను ప్రాసెసింగ్ కంపెనీల వ్యాపారులు  సిండికేట్లుగా ఏర్పడి అందినకాడికి దోచుకుంటున్నారు .నాలుగేళ్లుగా రొయ్యలకు గిట్టు బాటు ధరలు లేక , పెరిగిన కరెంటు బిల్లులు , ఫీడ్ , సీడ్ లతో రైతులు సతమతమవుతున్నారు . సాధారణంగా అవా రైతులు ఏడాదికి రెండు క్రాపుల్లో 3.75 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నారు  . రెండో క్రాపు లో 2 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తారు . అయితే ఈ సారి తొలి క్రాపులోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇంకా రెండో క్రాపు సాగు చేయలేమని సాగుకు దూరమవుతున్నారు . కాగా ఈ ఏడాది ధరల కారణంగా జిల్లా రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు  పలువురు అంచనా వేస్తున్నారు. ఇక్కడ పండించిన రొయ్యలు 90 శాతం వరకు ఇరత దేశాలకు ఎగుమతి అవుతున్నాయి . జిల్లాలోని వ్యాపారులు బయట ప్రాంతాల నంచి రొయ్యల కొనుగోలు దారులను రానివ్వకుండా , ధరలు పెంచకుండా అడ్డుకుంటున్నారు .

సాగుఖర్చులు ఇలా

ఒక హెక్టారు విస్తీర్ణంలో రొయ్యల సాగు చేయాలంటే దాదాపు రూ.4.70 లక్షల ఖర్చు అవుతుంది .లక్ష రొయ్య పిల్లలు , ట్రాన్స్ పోర్టుతో కలిపి రూ .20 వేలు , ఫీడ్ 1800 కిలోలకు రూ.1.50  లక్షలు ,కరెంట్ బిల్లులు రూ.30 వేలు  కెమికల్స్ రూ.45 వేలు చెరువుకు లీజు రూ.1.50 లక్షలు , కాపలా , ఫీడ్ బాయ్స్ , ల్యాబ్ పరీక్షలు , తదితరాలు కలిపి మరో రూ.25 వేలు పెట్టుబడులు అవుతున్నాయి . క్రాపు బాగా వఛ్చి , ధరలు బాగా ఉంటె హెక్టారుకు 11.5 టన్నుల దిగుబడి సుమారు రూ .4.5 నుంచి రూ.5 లక్షల వస్తుంది . కాని ప్రస్తుత దిగుబదులు , ధరలతో పోల్చుకుంటే హెక్టారుకు రూ .1.5 లక్షలు నష్టం వస్తోంది . నాసిరకంగా ఉన్నందున ఎగుమతులు నిలిచిపోయాయని చెబుతు సిండికేట్లుగా ఏర్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు రొయ్యలను దోచుకుపోతున్నారు.

Source : sakshi

Languages

Shares

Related News