సముద్ర తీర గ్రామాల్లో రైతులు ఆక్వా సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 20 వేల ఎకరాలకు పైగానే రొయ్యల సాగు చేపట్టనున్నారు. ఆరంభం నుంచి మొలకువలు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చనిమత్స్యశాఖ అభివృద్ధిఅధికారి హెన్రీ సూచిచారు. అందుకు ముందుగా చెరువును ఆరబెట్టాలి. నీరు లేకుండా పూర్తిగా ఎండిన తరువాత కట్టలు బలపరచాలి. అవసరమైన చిన్నచిన్న మరమ్మత్తులు పూర్తి చేయాలి. ఎత్తుపల్లాలు ఉంటే ట్రాక్టర్ తో సరిచేసి చెరువు అడుగు భాగం సమతలంగా ఉండేలా చూసుకోవాలి. నీరు పెట్టే ముందు జిప్సం , సున్నం చెరువంతా చల్లాలి. తరువాత చెరువు లోతు ను బట్టి నీరు నింపాలి. రొయ్యపిల్లలు వదిలే ముందు కృత్రిమంగా తయారు చేసిన ప్రోబయాటిక్స్ సిద్దం చేసుకోవాలి. పీహెచ్7.5-8.2 ఉండే విధంగా చూసుకోవాలి.
రొయ్యపిల్లలను వదిలే విధానం
చెరువు విస్తీర్ణం, వనరులను బట్టి నాణ్యమైన రొయ్యపిల్లలను ఎంపిక చేసుకోవాలి. వెనామి పంట మూడూ నుంచి నాలుగు నెలల్లో చేతికి వస్తుంది. అదే టైగర్ అయితే 4-6 నెలల సమయం పడుతుంది. వెనామి సాగులో ప్రారంభం నుంచి మొలుకవలు పాటించాలి. ఖర్చు ఎక్కువ పెట్టాలి. ఎకరా విస్తీర్ణంలో వెనామి అయితే 50 వేల పైన పిల్లలను వదలాలి.అదే టైగర్ అయితే 30 వేలు సరిపోతుంది.రొయ్య పిల్ల వదిలిన నీటి నుంచి వాటికి ఆక్సిజన్ అందించాలి. అందుకు ఏరేటర్లను సమకూర్చాలి. జనరేటరు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన మేత అందించాలి. నీటిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా యాంటీబయోటీక్స్ , ప్రోబయోటిక్స్ వాడాలి. సాగులో వైరస్ లు సోకకుండా జాగ్రత్తలు వహించాలి. తద్వారా అధిక దిగుబడులు సాధించాలి.
source: eenadu