For Advertisement Enquiries Please Contact +91 7901268899

మంచి విత్తనంతో మేలైన దిగుబడి

img

ఆక్వా సాగు రైతులకు సిరులు పండిస్తోంది రాష్ట్రంలో సుమారు 1.20 లక్షలను సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం  రైతుల కృషి ఫలితంగా ఆక్వా సాగు గణనియంగా  వృద్ధి చెందింది . అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూనే రైతులు సాగును కొనసాగిస్తున్నారు 90 శాతం చెరువుల్లో రొయ్యల విత్తనం వేసే సమయం ఇదే వనామి రకం రొయ్యలనే అధికంగా సాగు చేస్తున్నారు . వీటి సాగులో వ్యాధుల వాళ్ళ కలిగే నష్టాలను అధిగమించాలంటే నాణ్యమైన విత్తనం తప్పనిసరి  నాణ్యమైన విత్తనం వాటి లక్షణాలు రైతులు పాటించాల్సిన పద్ధతులను కైకలూరు మత్స్యశాఖ సహాయ సంచాలకులు డి సాల్మాన్ సుధాకర్ వివరించారు.
విత్తన నాణ్యతకు పరీక్షలు
సెలినీటి ఉష్టోగ్రత , ఫార్మాలిన్ ఒత్తిడిలను గమనించాలి .
సెలినీటి ఒత్తిడి
 ఒక ప్లాస్టిక్ బేసిన్లో 200 నుంచి 300 రొయ్య పిల్లలను హెచ్చరి నుంచి తీసుకోవాలి . హెచ్చరి నీటి సెలినీటి ని సగానికి తగ్గించి మూడు , నాలుగు అంతలా పాటు రొయ్య పిల్లల బతుకుదలను గమనించాలి . సెలినీటి వల్ల ఒత్తిడికి గురైన రొయ్య పిల్లలు బేసిన్ అంచు చుట్టు తిరుగుతుంటాయి . ఎంత శాతం  రొయ్య పిల్లలు చురుకుగా ఉన్నాయో లెక్కించాలి . ఇవి 85 నుంచి 90 శాతం బతికి ఉంటె … మంచి విత్తనంగా భావించాలి .
 ఉష్టోగ్రత ఒత్తిడి
 ప్లాస్టిక్ బేసిన్లో నీటి ఉష్టోగ్రత 5 డిగ్రీలు పెంచడం , లేదా 5   డిగ్రీలు  తగ్గించడం కానీ చేయాలి . గంట తరువాత రొయ్య పిల్లల బతుకుదలను గమనించాలి .85నుంచి 90 శాతానికి పైగా పిల్లలు బతికి ఉంటేనే మంచి విత్తనంగా గుర్తించాలి.
ఫార్మలిన్ ఒత్తిడి
ప్లాస్టిక్ బేసిన్లో 200-300 రొయ్య విత్తనాన్ని తీసుకోని , హెచ్చరి నీటిలో  10 పీపీఎం  ఫార్మాలిన్ లో ఉంచి మూడు నాలుగు గంటల  తరువాత పరిశిలించారు . ఒత్తిడికి గురైతే బేసిన్ మధ్య ఆరోగ్యమా ఉంటే అంచుల వెంట ఈదే పిల్లలు కనిసం 90 శాతం ఉండాలి ।
 ప్లాస్టిక్ బేసిన్లో  హేచరీల్లో ట్యాకుంల్లో నీటిని పోసి రొయ్య పిల్లలను వేసి చేతితో నీటి ప్రవాహాన్ని సృష్టించి నీటి ప్రవాహానికి ఎదురీదుతూ చురుగ్గా   ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి పీ ఎల్ 10 లేదా 11 పారిమాణం కలిగిన పిల్లలు మాత్రమే చెరువుల్లో వేయడానికి అనుకూలం . ఉప్పు శాతం తక్కువగా ఉన్న చెరువులో 12 పీ ఎల్  పరిమాణం ఉన్న రొయ్య పిల్లలను వేయవచ్చు రొయ్య పిల్లలను రవాణా చేసే దూరాన్ని బట్టి 1500 పిల్లలు మించకుండా  ప్లాస్టిక్ సంచుల్లో ఆక్సిజన్ నింపి రవాణా చేయాలి . పిల్లలను చెరువుల్లో వేసిన దగ్గర నుంచి పిల్లల పరిమాణం నీటి లక్షణాలు , మేత ల పరిమాణం ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు  చేయాలి . చెరువులో  ఆపా కట్టి అందులో 2,3 రోజుల పాటు విత్తనాన్ని ఉంచి ఉష్ణోగ్రత , సెలినీటి ల ప్రభావం పిల్లల బతుకుదలపై ఏవిధంగా ఉందో గమనించాలి   .
Source : eenadu

 

Languages

Shares

Related News