అమరావతి: రొయ్యల్లో యాంటీబయోటిక్స్ గుర్తించేందుకు అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి ఆది నారాయణ రెడ్డి పేర్కొన్నారు.ప్రైవేటు రంగంలో కూడా ప్రయోగశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రొయ్యల సాగులో యాంటిబయోటిక్స్ వాడకాన్ని నియంత్రించేదుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచివాలయంలోని మంత్రి కాత్యాలయంలో సమావేశం జరిగింది. ఈక్వెడార్లో రైతులు అవలంభిస్తున్న విధానాలను చర్చించారు.శాస్త్రవేత్త యహీరా యాంటిబయోటిక్స్ వినియోగించకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. ఆమె సలహాలు తీసుకుని ఇక్కడ కూడా అలాంటి విధానాలు అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. రొయ్యల చెరువుల రిజిష్ట్రేషన్ ప్రక్రియ త్వతితగతిన పూర్తి చేయాలని సూచించారు.
Source : enndu