కొత్తపట్నం సముద్ర తీరానికి మహర్ధశ పట్టనుంది.ఇప్పటి వరకు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకే పరిమితమైన ఫిషింగ్ హార్బర్ల జాబితాలో తాజాగా కొత్తపట్నం కూడా చేరనుంది. రూ. 300 కోట్లతో కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రస్ధాయి ఉన్నతాధికారుల బృందం కొత్తపట్నం సముద్ర తీరాన్ని పరిశీలించి వెళ్ళింది. మత్య్సశాఖ కమిషనర్ రామశంకర నాయక్, మెరైన్ విభాగం డైరెక్టర్ వెంకటేశప్రసాద్, మెరైన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ వి.వి. రావు కొత్తపట్నం సముద్ర తీరాన్ని పరిశీలించి ప్రాధమిక నివేదికను రూపొందించారు. కొత్తపట్నం సముద్రతీరాన్నిసైంటిఫిక్ స్టడీ చేసేందుకు పూణే నుంచి ప్రత్యేక బృందం రానుంది. యూరోపియన్ యూనియన్ నిబంధనల మేరకు కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు అనుకూలత ఉందా లేదా అన్న విసఃఅయాన్ని క్ష్నుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీఐసీఈఎఫ్ అనే విభాగానికి అందజేయనుంది. ఈ ప్రాంతం ఫిషింగ్ హార్బర్ కు అనుకూలమని తేలితే తదుపరి ప్రక్రియను యుద్దప్రాతిపదికన చేపట్టేందుకు వీలుగా కసరత్తు జరుగుతోందొఇ. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏరొపాటు వల్ల మిగిలిన తీర ప్రాంతాల మత్యకారులకు కూడా ప్రయోజనాలు కలగనున్నాయి. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు వల్లమత్స్యసంపద పెరగడంతో పాటు మత్య్స్కారుల ఆదాయం కూడా మరింత పెరగనుంది.దీంతో కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు ఎప్పుడుచేస్తారా అని మత్య్సకారులుకూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
జిల్లాలోని ఒంగోలు ,కొత్తపట్నం , నాగలుప్పలపాడు,చినగంజాం ,వేటపాలెం, చీరాల, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో 743 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. దాదాపు 20 వేల మందికి పైగా మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళి కుటుంబాలను పోషించుకుంటున్నారు.జిల్లాలో 102 కిలోమీటర్ల మేర సముద్ర తీర విస్తరించి ఉండటంతో ఎక్కువ మంది మత్స్యకారులు వేటనే జీవనాధారం చేసుకున్నారు. ఇందుకోసం 45 మెకనైజ్డ్ బోట్లు, 1900 మోటరైజ్డ్ బోట్లు,2300 సంప్రదాయ పడవలను ఉపయోగిస్తున్నారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు కొన్నిసందర్బాల్లో వారానికి పైగాసముద్రంలోనే ఉండి వస్తున్నాంటారు. వేట సాగించి వచ్చిన తరువాత చేపలను విక్రయించుకునే సమయంలోదళారీలు రంగప్రవేశం చేసి వారి శ్రమ ను సముద్రం పాలు చేస్తున్నారు. గిట్టుబాటుధర వచ్చేవరకుచేపలను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో వాటినితెగనమ్ముకుంటూ తమ కష్టాలను దళారుల పాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే మత్య్సకారులకు మంచి గిట్టుబాటూ ధర లభిస్తంది. తమకు ధర వచ్చే వరకు వారు అక్కడ నిర్మించే స్టోరేజ్ రూమ్ లో నిల్వ చేసుకునే వెసులుబాటూ ఉంటుంది. ఫిషింగ్ హార్బర్ వల్ల ఎక్స్పోర్టు క్వాలిటీ కూడాపెరగనుంది. ఇక్కడ నుంచి అధిక టన్నుల్లోఎగుమతులు జరగడం వల్ల మత్య్సకారుల ఆదాయం రెట్టింపు కానుందీ . వేటకు అనుబంధంగా ఆధరపడిన వారి ఉపాధి అవకాశాలు కూడా మరింతగా మెరుగుపడనున్నాయి.
Source: sakshi