ఆక్వా రైతులు చేపలు పట్టె సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల 10 నుంచి20 శాతం వరకు నష్టపోతున్నారు. తగిన జాగ్రత్తలు తిసుకోవడం ద్వారా చేపలు, రొయ్యల నాణ్యత పెరిగి మారెక్ట్ లో ఎక్కువ ధర లభిస్తుంది.
*చేపల పట్టుబడికి వారం ముందు చెరువు అడుగు భాగంలోని న్నిటిని బయటికి పంపాలి.తిరిగి మంచి నీటితో చెరువును నింపడం వల్ల చేప,రొయ్యలకు మట్టి వాసన రాదు .
*చేపలు,రొయ్యలు పట్టె ఒక్క రోజు ముందు వాటికి అదనపు ఆహారం ఇవ్వడం ఆపివేయాలి.
*పట్టుబడికి ఉపయోగించే వలలు , ఇతర సామాగ్రిని ఒక శాతం క్లోరిన్ నీటితో శుభ్రం చేయాలి.
* పట్టుబడి చేసిన తరువాత చేపలు , రొయ్యలు ఎండ తాకిడికి గురి కాకుండా చర్యలు చేపట్టాలి .
*పట్టుబడి చేసిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి , ఇలా చేయడం వల్ల చేపలు , రొయ్యలపై ఉండే 90 శాతం సూక్ష్మక్రిములు తొలగిపోతాయి .
*గాయాలు , దెబ్బ తగిలిన చేపలను , గుల్ల విడిచిన రోయ్యలను మిగిలిన వాటి నుంచి వేరు చేయాలి .
*పట్టుబడి చేసిన తరువాత చేపలను రొయ్యలను నేలమీద పోయ రాదు .
*తూకం వేసిన చేపలు, రొయ్యలను సన్నని ఐస్ ముక్కలను 1:1 నిష్పత్తిలో కలిపి ప్లాస్టిక్ పెట్టెలో ప్యాకింగ్ చేసి చేరాల్సిన ప్రదేశానికి వీలైనంత త్వరగా రవాణా చేయాలి . ఈ ప్లాస్టిక్ పెట్టెలో అడుగు భాగాన సన్నని రంధ్రాలు చేయాలి .
*రొయ్యలను రాగి ,ఇనుము వంటి సామాగ్రిలో ఉంచకూడదు ఇలా ఉంచిన రొయ్యల శరిరం పై నల్లని మచ్చలు ఏర్పడి , మార్కెట్ లో సరైన ధర లభించదు .
*పట్టుబడి చేసిన రొయ్యలను 0.25-0.3 శాతం సోడియం లేదా పొటాషియం బైసల్ఫేట్ ద్రావణంలో రెండు నిమిషాలు ఉంచితే రొయ్యలపై మచ్చలు పోయి ఎక్కువ ధర లభిస్తుంది
source : eenadu