అమరావతి : ఆహారశుద్ధి రంగంలో ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో మూడు ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు . విజయవాడలో నిర్వహిస్తున్న వాణిజ్య ఉత్సవ్ రెండోరోజు బుధవారం ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలపై ప్రసంగించారు . వ్యవసాయ , అనుబంధ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది . ఎగుమతులను ప్రోత్సహించటంలో భాగంగా అపేడా , ఎంపెడా , ఎగ్జిమ్ బ్యాంక్ వంటి సంస్థలో రైతులు , రైతు ఉత్పత్తి సంఘాలు, మత్స్యకారుల మధ్య ప్రభుత్వం సమన్వయం చేస్తోంది . సరుకు రవాణా ఖర్చు లను తగ్గించడానికి చిత్తూరు రైల్వే స్టేషను నుంచి పాలు , మత్స్య ఉత్పత్తులు, మామిడిపండ్లు రవాణాకు కిసాన్ రైలును ఏర్పాటుచేశాం అన్నారు. సెజ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను విశాఖ ఎస్ఈజెడ్ జోనల్ డెవలప్మెంట్ కమీషనర్ రామోహనరెడ్డి వివరించారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల ఎగుమతులకు ఉన్న అవకాశాలకు ఫ్లెక్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీభాష్ దశమహాపాత్ర టెక్సప్రోసిల్ బోర్డు మెంబరు సుధాకరచౌదరీ వివరించారు.
ఎంపెడా స్టాల్ కు మొదటి బహుమతి
వాణిజ్య ఉత్సవం - 2021 లో ఎంపెడా ఆధ్వర్యంలోని స్టాల్ కు మొదటి బహుమతి లభించింది. ఎంపెడా స్టాల్ లో తిలాఫియా చేపలు ఆక్వేరియం తో పాటు వివిధ అలంకరణ చేపలు ఆకట్టుకున్నాయి. ఆర్కే హెయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాల్ ద్వితీయ మచిలీపట్టణం ఇమిటేషన్ ఆభరణాల సంగం స్టాల్ తృతీయ బహుమతిని దక్కించుకున్నాయి.
source:eenadu
www.aquall.in