గుంటూరు, ఏఎన్ యూ: రాష్ట్ర విభజన అనంతరం 974 కిలో మీటర్ల తీర ప్రాంతంలో దేశంలో ఏపీకి ప్రముఖ స్ధానం లభించింది.జల సంపదతో పాటు విస్తారమైన మత్య్స ఉత్పాదనకు అనువైన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇదే అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగు , మత్య్స ఉత్పాదనపై దృష్టి సారిస్తోంది. మత్స్య ఉత్పత్తిలో ఇప్పటికే రాష్ట్రం ప్రధమ స్ధానంలో ఉంది. ఎగుమతుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించడానికి ఆక్వా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, యూనివర్సిటీల ఏర్పాటూకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటికి అనుగుణంగా మానవ వనరుల లభ్యత అవసరం ఏర్పడింది దీంతో ప్రస్తుత్తం రాష్ట్రంలో ఆక్వా రంగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ఈ కోర్సు చేసిన వారు ఉద్యోగం కోసం వెతుకులాడుకోవాల్సి వచ్చేది. అయితే ప్రస్తుత్తం ఈ కోర్సు చదువుతుండగానే ప్రపంచ స్ధాయి కంపెనీలు వచ్చి క్యాపంస్ ఇంటర్వ్యూల ద్వారానే ఉద్యోగాలకు విద్యార్ధులను ఎంపికచేసుకుంటున్నాయి. ఇదేక్రమంలో రాజధాని అమరావతి పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వ విధ్యాలయం ఆక్వా కల్చర్ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వంద శాతం ఉద్యోగాలు లభిచాయి .2015-17 విద్యా సంవత్సరానికి సంభంధిచి 30 మంది విద్యార్ధులు ఇటీవల పీజీ ఆక్వాకల్చర్ కొర్సునుపూర్తి చేశారు . అందులో 24 మంది విద్యార్ధులకు ఆక్వాకల్చర్ రంగంలోని వివిధ జాతీయ,అంతర్జాతీయకంపెనీలలో ఉద్యోగాలు లభించాయి. కోర్సుపూర్తి కాకముందే ఉద్యోగాలు రావడంతో విద్యార్ధులు అనందాన్ని వ్యక్త పరిచారు.
Source: Andhra jyothi