For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్య.. చనిపోతోందయ్యా!

img


రొయ్య.. చనిపోతోందయ్యా!

న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం: రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో తెల్ల మచ్చ వంటి తెగుళ్ల సమస్యతో రొయ్య రైతులు విలవిల్లాడుతుంటే... జిల్లాలో మాత్రం చెరువులోనే పిల్లలు చనిపోతుండడం, ఉన్న వాటిలోనూ ఎదుగుదల లోపించడంతో నష్టపోతున్నారు. మరోవైపు వారం రోజుల్లోనే టైగర్ రకం ధర కిలోకు రూ.60కి పైగా పడిపోవడంతో సాగుదారులు ఆందోళన
చెందుతున్నారు.
విత్తన నాణ్యత లేక...
చెన్నైకి చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు మడగాస్కర్ దేశం నుంచి తల్లి టైగర్ రొయ్యను దిగుమతి చేసుకుని... చెన్నై, పాండిచ్చేరి, నెల్లూరు, గూడూరు, ఉలవపాడు మండలం కరేడు ప్రాంతాలకు చెందిన 14 హేచరీల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో పిల్లను రూపాయి చొప్పున రైతులకు విక్రయిస్తున్నారు. ఎకరా చెరువుకు 50 వేలు సాగు చేస్తుండగా... వీటిలో సగానికిపైగా చనిపోతున్నాయి. పంట కాలం ఏడు నెలలు ఉంటే కనీసం 50 గ్రాములు రావాలి. కానీ 10 నుంచి 15 గ్రాముల మధ్యనే ఎదుగుదల నిలిచిపోతోంది. తప్పని పరిస్థితుల్లో ఉన్న మేరకు అమ్మేద్దామని మధ్యలోనే పంట తీసేయాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లల్లో నాణ్యత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం, అధిక ఉష్ణోగ్రతలు, మబ్బుతో కూడిన భిన్న వాతావరణ పరిస్థితులూ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వాపోతున్నారు.
• ఎకరా చెరువు సాగుకు కనీస పెట్టుబడి రూ. 3 లక్షలు అవుతుండగా... మధ్యలోనే పంట తీసేయాల్సి రావడంతో రాబడి రూ. లక్షకు మించడం లేదు. దీంతో నికరంగా రూ.2 లక్షల మేర నష్టం తప్పడం లేదు.
• జిల్లాలోని ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, నాగులుప్పలపాడు
మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో సుమారు 18 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటిలో దాదాపు 15 వేల ఎకరాల్లో టైగర్, మిగతా మూడు వేల ఎకరాల్లో వనామీ రకం సాగు చేస్తున్నారు.

Languages

Shares

Related News