జిల్లాలోని రొయ్యల సాగు రైతులు ఎదుర్కొంటున్న యాజమాన్యం , సాగులో మెళుకువలు, నివారణ చర్యల గురించి యాంటీబయోటిక్స్ వాడకంపై ఈ నెల 10 న అవగాహన సదస్సు నిర్వహిస్తారని అవంతి సీడ్స్ కంపెనీ జిల్లా రీజనల్ మేనేజర్ కె. గోపాలకృష్టా తెలిపారు. ఈ అవగాహన సదస్సు ఒంగోలులోని ఎంఎస్ పంక్షన్ హాలులో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతోందని తెలిపారు. సమావేశానికి అవంతి సీడ్స్ జనరల్ మేనేజర్ పీకే శెట్టి , డీజీఎం ఎస్ మహంతి , ఏరియామేనేజర్ నారాయణస్వామి హాజరు అవుతున్నారు. వీరితో పాటు రొయ్య సాగులో మెళుకువలు. యాంటీబయోటిక్స్ వాడకం గురించి తెలియజేసే శాస్త్రవేత్తలు డాక్ట్ర్ లాప్ట్రన్, స్టీఫెన్ రావైట్ హాజరు కానున్నారని. తెలిపారు. మొత్తం 600 మంది రొయ్యల సాగు రైతులు హాజరవుతారహాజరవుతారన్నారు.ఇంకా సెమినార్ గురించి తెలియని జిల్లాలోనిరొయ్యలసాగు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ రీజనల్ మేనేజర్ కె. గోపాలకృష్ట కోరారు.
Source : saskhi district