వాతావరణ మార్పులతో రొయ్యల్లో వ్యాప్తి చెందే వ్యాధులు వాటి నివారణ చర్యలను ఉండి మత్స్యపరిశోధనా స్ధానం శాస్త్రవేత్త ఎన్. వీరభద్రరావు తెలిపారు(సెల్ : 9603938318).
తెల్ల మచ్చల వ్యాధి : ఈ వ్యాధి సోకిన రొయ్యలు అకస్మాత్తుగా మేతలు తినడం తగ్గించి బలహీనపడుతాయి. రొయ్య బాహ్యకవచ గుల్లపై తెలుపు రంగులో రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. శరీరం , మొప్పలు ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారతాయి. చెరువు గట్ల దగ్గరకువచ్చి రొయ్యలు ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధికి చిక్సిత లేదు. కాబట్టి ఉత్తమ మార్గం .
నల్ల మొప్పల వ్యాధి
చెరువులో సేంద్రియ పదార్ధాలు , వృధా అయ్యే మేతల వల్ల అమోనియా , నైట్రేట్ , హైడ్రోజన్ సల్పైడ్ వంటి విష వాయువులు అధిక గాఢతలో వెలువడూతాయి. ఈ వ్యాధి సోకిన రొయ్యల మొప్పలు క్షీణించి నల్లగా మారతాయి. అయా సందర్భాల్లో చెరువులో తగినంత ఆక్సిజన్ లేని పక్షంలో రొయ్యలు చని పోయే ప్రమాదం ఉంటుంది. నివారణకు మేత వృధాను తగ్గించాలి.పంటలమధ్య కనీసం 2 నెలలు విరామం ఉండాలి. ఒక సారి పట్టుబడి అయిన తరువాత నేల పగుళ్లు వచ్చేవర్కు చెరువును ఎండబెట్టాలి.
వైట్ గట్
ఈ వ్యాధి సోకిన రొయ్యల ఆహార నాళం తెల్లబడుతుంది. వ్యాధి సోకిన రొయ్యలున్న చెరువులో తెల్లని రెట్టలు నీటిపై తేలుతుంటాయి. రొయ్యలు మేతలు సరిగా తీసుకోకపోవడం వల్ల పెరుగుదల ఆగిపోయిచనిపోతాయి.
నివారణకు : చెరువుల్లో సేంద్రియ పదార్ధాలు పేరుకుపోకుండా జాగ్రత్తలు పాటించాలి . పట్టుబడి తరువాత చెరువులో ఒక అంగుళం మేర మట్టి పొరను బ్లేడుతో తొలగించాలి.రొయ్య పిల్లలను నేరుగా ప్రధాన చెరువులో వదలకుండా ముందు 25 రోజులు నర్సరీలో ఉంచి , తరువాత ప్రధాన చెరువులోకి మార్చాలి.
విబ్రియోసిస్ వ్యాధి
లవణియత (సెలినీటి/ఉప్పు)ఎక్కువగా ఉన్న నీటితో రొయ్యల సాగు చేస్తే .. ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశముంది. రొయ్యలకు తోక కొరుకుడు బొబ్బలు వచ్చి కాలేయం రంగు కూడా మారిపోతుంది. ఈ వ్యాధి సోకిన రొయ్యలు మేతలు తీసుకోవు . ఉదరం ఖాళీగా ఉంటుంది. వ్యాధి ఉధృత దశలో రొయ్యలుమరణించే ప్రమాదముంది . నివారణకు విత్తన కొనుగోలు దశలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.బయో సెక్యూరిటీ వంటి చర్యలు చేపట్టాలి.
Source : Eenadu