ఆక్వా రైతాంగానికి ఆదాయపన్ను మినహాయింపు లభించేలా కృషి చేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.ఈరంగంలో కూడా సన్న , చిన్న కారు రైతులున్నారని వారి కోసం నిబంధనలు సడలించి , వరి రైతు తరహాలో ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరతామన్నారు.
ఆక్వా రైతాంగాన్ని కూడా ప్రధన మంత్రి ఫసల్ భీమా యోజనలోచేర్చాలని కోరతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆక్వా రైతులు, ఆక్వా ట్రేడర్స్ సమస్యలపై సోమవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా రంగం అంటే చాలా ఇష్టమన్నారు. గతం కంటే ఇప్పుడు ఎంతగానో ఈ రంగం వృద్ధి సాధిస్తోందన్నారు.
రాష్ట్రం నుంచి ఏటా 27 లక్షల టన్నుల ఆక్వా ఉత్పతుల లక్ష్యం కాగా ప్రస్తుత్తం 17 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఆక్వా ఉత్పత్తుల ప్రోత్సహానికి రైతులకు త్రీ ఫేజ్ విద్యుత్ యూనిట్ రూ.3.70 కు అందిస్తుమన్నారు. ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చడంలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫిషరీస్పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వం ప్రారంభిచనుందని ప్రకటించారు. ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఆక్వాకోర్సులు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.