కనిగిరి : పోషహకారాన్ని అందించేందుకు జిల్లాలో ఆక్వా హబ్ లను ఏర్పాటు చేయనున్నట్ట మత్స్య శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు ఎ .చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు . కనిగిరి , పీసీపల్లి , పామూరు , వెలిగండ్ల , సీఎస్ పురం , హనుమంతునిపాడు మండలాల మత్స్య కారులకు ఆక్వా హబ్ ల ఏర్పాటు పై స్ధానిక ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు . ప్రభుత్వం ఆక్వా హబ్ ల ద్వారా నాణ్యమైన , పరిశుభ్రమైన చేపలు , రొయ్యలను ధరలకు అన్ని ప్రాంతాల ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు . మినీ ఔట్ లెట్ మత్స్యసంపద అమ్మకాలు , వ్యాపారాభివృద్ధికి బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా మంచి నీటి చేపలు , సముద్రపు చేపల ముక్కలు , రొయ్యలు , పీతలు పాటు ఇతర మాంసాహార ఉత్పత్తులు విక్రయిచుకోవచ్చని వివరించారు . జిల్లాలో మొట్టమొదటి గా చీరాల , పర్చూరు , అద్దంకి తదితర ప్రాంతాల్లోని 16 మండలాల్లో 90 మినీ ఫిష్ అవుట్ లెట్ ఒక భారీ ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు . సమావేశంలో సంయుక్త సంచాలకుడు రంగనాధ్ బాబు , ఉషారాణి , అధికారులు పాల్గొన్నారు .
source eenadu
www.:aquall.in