ఏడెళ్ల క్రితం కాసులు కురిపించిన ఆక్వారంగం నేడు కుదేలవుతోంది .వివిధ వైరస్ లు చెరువులను తుడిచి పెట్టేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్ధితిలోకొట్టుమిట్టాడుతున్నారు. రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టి సీడ్ వేసిన 50 – 70 రోజులకే వైరస్ లు సోకి రొయ్యలు చనిపోవడంతో ఇప్పటికే అనేక మంది నష్టాలను చవిచూశారు..
టంగుటూరు :
జిల్లా సముద్ర తీరంలోని టంగుటూరు , సింగరాయకొండ , చినగంజాం, చీరాల, ఉలవపాడు , గుడ్లూరు , కొత్తపట్నం , వేటపాలెం , ఒంగోలు మండలాల పరిధిలో సుమారు 15 వేల ఎకరాలకు పైగా చెరువుల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు . పిల్లల నాణ్యత విషయంలో ప్రభుత్వం కరినంగా వ్యవహరించడంతో వాటి మరణాలు తగ్గి బతుకుదల శాతం పెరిగింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు ప్రతికూలంగా మారి వైట్ గట్ , వైట్ స్పాట్, విబ్రియోసిస్ వైరస్ లు ప్రబలడంతో అవి సోకిన రొయ్యలు ఎరుపు రంగుకు తిరిగి చనిపోతున్నాయి. దీంతో సరైన కౌంటురాకుండానేపట్టుబడులు చేస్తుండగా అధికంగా వస్తున్న సరుకును తాము కొనుగోలు చేయలేమంటూ ప్రాసెసింగ్ కేంద్రాల నిర్వాహకులు , ఎగుమతి దారులు చేతులెత్తేసే పరిస్ధితులు ఏర్పాడ్డాయి. దీనికి తోడు పట్టుబడిలో చిన్నవి ఎక్కువగా ఉంటంతో వారు కూటమి కట్టి తక్కువ ధరకేకొనుగోలు చేసి చెన్నె, బెంగళూరు , ముంబయులకు తరలించి లాభపడుతున్నారు. రొయ్యల నిల్వకు శీతల గిడ్డంగుల్లేక అయునకాడికే అమ్ముకోవాల్సిన దుస్ధి౧౦౦తి దాపురించిందని రైతులు వాపోతున్నారు.
నెల వ్యవధిలో ధరల తగ్గుదల
రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఉష్ణోగ్రత రోజురోజుకూ మారడం , వైరస్ ల తాకిడికి ఎక్కువగా ఉండటంతో 80 కౌంటుపై ఉన్న వాటి పట్టుబడి అధికంగా ఉంటోంది . వైరస్ ల విజృంభణతో ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పట్టుబడి అధికంగా ఉంది. నెలక్రితం 50 కౌంటు కిలో రూ. 360 పలుకగా ప్రస్తుతం రూ.330 కి పడిపోయింది. 60 కౌంట్ వి కిలో రూ. 330 కు లభించగా ప్రస్తుతం రూ. 300 గా ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన నేపధ్యంలో సాగు పరిస్ధితులు రైతులకు మింగుడు పడటం లేదు . నెల వ్యవధిలో టన్నుకు సరాసరిన రూ. 30 వేలు తగ్గిపోయింది.
మేత మోతే ....
రొయ్యల మేత ఖర్చు అమాంతం పెరగడంతో సాగుదారులు తల్లడిల్లతున్నారు. 20 రోజుల క్రితం కిలో రూ. 65-70 బరకు ఉండగా ప్రస్తుతం రూ. 70 – 75 వరకు ఉంది. దీంతో గతంలో ఎకరా చెరువులో వేసే మేత ఖర్చు రూ. 50 వేలు అయ్యేది. ఇప్పుడు సుమారు రూ. లక్ష అవుతుండటంతో సాగు అంటేనే భయపడిపోతున్నారు.
Source : Eenadu