ఈ ఏడాది ఆక్వా ఉత్పత్తుల విషయంలో కృష్టా జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్ధానంలో నిలిచింది .రైతులు ఏడాదికి 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం అధిగమించారు . జిల్లాలో 38,970 మంది రైతులు 1.75 లక్షల ఎకరాల్లో చేపలు , రొయ్యలు సాగు చేస్తున్నారు .అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో 5,024 మంది రైతులు 11,687 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తూ నూతన ప్రక్రియలు అమలు చేస్తున్నారు .వరి తర్వాత అత్యధికంగా సాగు చేస్తున్న ఆక్వా రంగం ద్వారా రాష్ట్రానికి ఈ ఏడాది రూ .14 వేల కోట్ల ఆదాయం వచ్చింది .కోవిడ్ నేపథ్యంలో కూడా మార్చి నెలలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎగుమతులకు అనుమతిచ్చారు .
కొత్త రకాల సాగును ప్రోత్సహిస్తూ రైతులకు అధికారులు అందించిన సహకారం ఫలించింది .రైతులకు విధ్యుత్ పై భారం తగ్గిస్తూ యూనిట్ రూ .1.50 కు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు .కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు 5 వడ్డీకే ఆర్ధిక సహాయం అందిస్తూ రైతులను ఆదుకోవడం కూడా కొంత మేర ఉపయోగపడింది .ఈ ఏడాది ఆగష్టు 5 నుంచి నాణ్యమైన విత్తనాలను మంచి హేచరీస్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది .నాణ్యమైన మేతలను సరఫరా చేయడం , వ్యాధులను , గుర్తించడం నివారణతో పాటు నీటి గుణాలను గుర్తించడానికి జిల్లాలో 5 సమీకృత ఆక్వా ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నారు .రాష్ట్రంలోనే మొదటి సారిగా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో నల్ల జెల్ల సాగు కోసం బ్యాకు యార్డు హేచరీ నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు .ఈ రకం చేపలకు పశ్చిమ బెంగాల్ లో మంచి గిరాకీ ఉంది .ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఆక్వా ఉత్పత్తుల్లో కృష్టా జిల్లా ప్రధమ స్ధానంలో నిలిచిందని మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు షేక్ లాల్ మహ్మద్ పేర్కొన్నారు .
source : eenadu