అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఏడీఏ బిల్లును బుధవారం శాసనసభ ఆమెదించింది . రాష్ట్రంలో చేపలు , రొయ్యల సాగు అభివృద్ధికి సంభందించిన ప్రాధికార సంస్ధ బిల్లును మత్స్య , పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు .బిల్లు ఆమెదం పొందిన అనంతరం మంత్రి మోపిదేవి మాట్లాడారు .ఆయన ఏం చెప్పారంటే ....
1.ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ అగ్ర స్ధానంలో ఉండగా , దేశ ఎగుమతుల్లో 50 శాతం రాష్ట్రం నుంచి అవుతున్నాయి .కరోనా కష్ట కాలంలో 80 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయించాం .
2.ఆక్వా రంగానికి ప్రధానమైన విధ్యుత్ యూనిట్ రేటు గతంలో రూ. 3.50 ఉండగా , దాన్ని రూ. 1.50 తగ్గించాం .
3. 9 జిల్లాల్లో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు , 4 మైనర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రూ .3200 కోట్లతో నిర్మించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు .
4. ఆక్వా రంగంలో తీసుకున్న నిర్ణయాలతో 18 లక్షల మంది నిరుద్యోగ యువకులకు పరోక్షముగానూ , ప్రత్యక్షముగానూ ఉపాధి లభిస్తోంది .
5. వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఈ రంగం అసంఘటిత రంగంగా ఉన్న పరిస్ధితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ రంగంలో ఉన్న వారికీ భరోసా కల్పిస్తున్నాయి .
6. వైస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆక్వా రైతుల సమస్యలు విన్నారు .అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు .ఈ మేరకు సమస్యలు పరిష్కరించారు .
ఆక్వా ప్రాధికార సంస్ధతో ప్రయోజనాలు ఇవే
1. చేపలు , రొయ్యల పెంపకంలో నూతన వ్యాపార మార్గాలను సృష్టించడం
2. ఆక్వా పెంపకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా , రాష్ట్ర స్థాయి తో ఏర్పాటు
3. ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటెలిజన్స్ సేవలు , చేపలు , రొయ్యలకు వచ్చే వ్యాధులపై నిఘా , నియంత్రణ చర్యలు
4.సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు రైతులకు ప్రయోజనం చేకూర్చడం . నాణ్యాతా ప్రమాణాలు పాటించేందుకు తనిఖీలు ...ఆడిట్లు
5.సీడ్ హేచరీస్ , ఫీడ్ ప్లాంట్ మేనేజ్మెంట్ , ఆక్వా ఉత్పత్తి చేసే రైతులు ప్రాసెసింగ్ చేసే ఎగుమతిదారులు భాగస్వాములను చేయడం .
6.ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో 36 చోట్ల రూ.50 కోట్ల వ్యయంతో ఆక్వా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు . క్వాలిటీ మెటీరియల్ అందించి రైతులు నష్టపోకుండా పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేయడం
7.అసంఘటిత రంగంగా ఉన్న ఈ రంగాన్ని సంఘటిత రంగంగా మార్చడం
source : sakshi