ఆంధ్రప్రదేశ్ పశుగణ , మత్స్య రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పశుసంవర్ధక , మత్స్య రంగ అభివృద్ధికి సంబంధించి సోమవారం శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయి .
రూ. 500 కోట్ల పెట్టుబడులతో ఫిష్ ఇన్
పంజరా వల విధానంలో తిలాఫియా చేపల పెంపకంపై అమెరికాకు చెందినా ఫిష్ ఇన్ సంస్ధ మత్స్య శాఖ మధ్య మరో కిలక ఒప్పందం కుదిరింది. 4 నక్షత్రల స్థాయితో ఆక్వాతో మెరుగైన విధానాలు పాటించే ఈ సంస్ధ రాష్టంలో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది . రాష్ట్రాల్లోని వివిధ జలాశయాల్లో ఫిష్ ఇన్ సంస్ధ తిలాఫియా చేపల పెంపకం చేపట్టనుంది దీనివల్ల 4 వేళా మందికి ప్రత్యక్షముగా ,8 వేళా మందికి పరోక్షముగా ఉపాధి లభిస్తుంది చేపల మెటా పరిశ్రమలు చేరువలో ఉండటం , ఓడరేవులు అభివృర్ధి, ఉత్సాహవంతమైనా రైతులు సానుకూలాఅంశాలని అధికారులు సీఎంకు వివరించారు. ఎపీ లో ఇలాంటి చేపల పెంపకానికి అనుకూలత ఉందన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ తిలాఫియా చేప వృద్ధిలో రొయ్యల కన్నా వేగవంతమైన , మెరుగైన వ్యాధినిరోధక శక్తి కలిగి ఉంటుందని చెప్పారు. రెండు నెలల్లో ఈ ఒప్పందం అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మత్స్య శాఖ , పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణా ద్వివేది, మత్స్య శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ పశు సంవర్ధక శాఖ డైరక్టర్ సోమశేఖరం ముఖ్యమంత్రి కార్య అర్షి రాజమౌళి ,సీసీఎంబీ రాకేష్ మిశ్ర పాల్గొన్నారు.
Source : eenadu