For Advertisement Enquiries Please Contact +91 7901268899

రైతుని ఆదుకోకపొతే క్రాఫ్ హాలిడే తప్పదు

img

అమలాపురం: ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో భూమిని నమ్ముకున్న రైతు అదేభూమిని అమ్ముకునే స్ధితికి ఉన్నాడని , కనీసం ఒక సెంటుభూమిని కూడా కొనలేని స్ధితిలో రైతు ఉన్నాడంటే రైతు దీన స్ధితి ఏస్ధాయిలో ఉందో ప్రతి రైతు తెలుసుకోవాలని రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షడు యెర్నేని నాగేంద్రనాధ్ అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడుజలగం కూమారస్వామి అధ్యక్షతన పంట విరామానికి పురిటిగడైన  అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామంలో సోమవారం రాష్త్రస్ధాయి రైతు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం నేతలుమాట్లాడుతూప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే క్రాఫ్ హాలిడేకిమరోసారి స్ధ్హమని హెచ్చరించారు. ముఖ్య అతిధిగా మాజీ డీజిపీ దినేష్ రెడ్డి ,సీబిఐ మాజీ డైరక్టర్ లక్ష్మీనారాయణ, బీకేఎన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు లు హాజరయ్యారు. . అ సందర్భంగా మాజీ డీజిపీ దినేష్రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలని పరిష్కరించకపోతే అధికార పార్టికీ పతనం తప్పదన్నారు. మరో ముఖ్య అతిధి జేడీలక్ష్మీ నారాయణ మాట్లాడుతూ రైతులకుజవాబుదారీతనంగా వ్యవహరించాలన్నారు. రైతులకు అందించే పంట బీమా మండలం యూనిట్ గా కాకుండా రైతు వారీగా నమోదుచేయాలని డిమాండ్ చేశారు.భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపతి రాజు విజయ కూమార రాజుమాట్లాడుతూ రైతులకు ప్రయోజనకరంగా ఉన్న స్వామినాధన్ కమిషన్ సిపార్సులని అమలు చేయాలని డిమాండ్ చేశారు.2011 అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామంలో  క్రాఫ్ హాలిడే చెసిన సమయంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటుచేసిన మోహన్ కందా కమిషన్ సిపార్సులు ఏ ఒక్కటి అమలు కాలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశామని , ప్రభుత్వం దిగి వచ్చి రైతులప్రధాన డిమాండ్  అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా1.85 లక్షల ఎకరాల్లో క్రాఫ్ హాలిడే చేస్తామని హెచ్చరించారు. భారతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రాయితీ  కృష్టా జిల్లా మినహా రాష్త్రంలో 12 జిల్లాలకు అందడం లేదన్నారు. రైతు సంఘాలసమాఖ్య అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది 20 శాతం అదనపుఖర్చు పెరుగుతుండగా కేవలం 3 శాతం మాత్రమే ప్రభుత్వం గిట్టుబాటుధర పెంచుతున్నారన్నారు. బీకేఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం తరహాలో రైతులకు పెట్టుబడి నిధి రూ.8 వేలు  ఇవ్వాలని డిమాండ్ చేశారు..రైతుల న్యాయమైన డిమాండ్లును  అమలుచేయకపోతే జులై 15 న కర్నూలు జిల్లా మహానందినుంచి శ్రీకాకుళం వరకు మోటారుసైకిల్ ర్యాలి చేసి మరో పంట విరామ చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆల్టాచైర్మన్ యాళ్ల దొరబాబు, పీసీసీ అధ్యక్షుడు అయినా బత్తుల బుచ్చి మహేశ్వరరావు , రాజధాని రైతు సంఘం నాయకులుఅనుమోలు గాంధీ,ఉప్పుగట్తి భాస్కర్రావ్ఉ ,తిక్కిరెడ్డిగోపాలకృష్ట  భారీగా రైతులు పాల్గొన్నారు.  
Source : sakshi
 

Languages

Shares

Related News