సంచార ప్రయోగశాల ఆక్వా రైతులకు ఎంతో ఉపయుక్తమని .. చెరువుల్లోని నీటిని ఎప్పటీకప్పుడు పరీక్షించమని తదనుగుణుంగా చేపలు , రొయ్యలకు ఆహారం అందించాలని మత్య్సశాఖ అధికారిణి షేక్ సమ్రీన్ అన్నారు.అల్లూరిలో ఆక్వా సాగు చేస్తున్న 35 మంది రైతుల చెరువుల వద్దకు మంగళవారం వెళ్ళి వారికు అవగాహన కల్పించారు. సంచార ప్రయోగశాల ద్వారాచెరువుల్లోని నీటిని పరీక్షించి ..రైతులకు నివేదిక అందజేశారు. అందులో పీ.హెచ్, అమ్మోనియా,ఐరన్ ఎంత మేరకుఉన్నాయో సూచించారు. కార్యక్రమంలో ఎంపీఎస్ ఈఏలు రాజాబీ, సుస్మిత , స్వప్న , నాగ్రేంద్రరేడ్డి, ఆక్వా రైతులు పాల్గోన్నారు.
Source: eenadu