హైదరాబాద్ :
రాష్ట్ర ప్రజల సాగు , తాగు నీటి అవసరాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కోటిన్నర చేప , రొయ్య పిల్లలు వదలాలని మత్స్య శాఖ నిర్ణయించింది . మంచిర్యాల , పెద్దపల్లి ,జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రాజెక్ట్ పై బేస్ సర్వే చేసిన ఆ శాఖ సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసింది.ఈ మూడు జిల్లాల్లో దాదాపు 30 గ్రామాలకు చెందిన వేలాది మత్స్యకార కుటుంబాలకు కాళేశ్వరం జీవనోపాధిగా మారనుందని సర్వేలో తేల్చి చెప్పింది .చేపలను ,వదిలేందుకు , పట్టేందుకు అనువైనా ప్రాంతాలను సైతం గుర్తించామని , ఈ ప్రక్రియ ప్రారంభమైతే చేపల ఉత్పత్తి , ఎగుమతులకు రాష్ట్రం తలమానికవుతుందని . కొన్ని జాతులకు రాష్ట్రం శాశ్వత చిరునామా అవుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు .
పది రకాల పెంపకానికి అనుకూలం
సర్వే చేసిన ప్రాంతాల్లో ప్రస్తుతం 320 టన్నుల చేపల లభ్యత ఉంది . ఇక్కడ పుట్టిన చేపలు మంచిర్యాల , గోదావరిఖని , మంథాని, మహాదేవాపూర్ , కాటారం , భూపాలపల్లి , మహాముత్తారం , పలిమెల్ల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు .తాజా సర్వే ప్రకారం నీటి లభ్యత ప్రవాహం ఆధారంగా పది రకాల చేపలు సహా రొయ్యలు పెంచేనందుకు ఇక్కడ అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు . బొచ్చ, రాహు , తిలాఫియా , బాపేరా , కోరమీను , జెల్ల, వాలుగ తదితర జాతులు సులభంగా ఎదుగుతాయని అధికారులు చెబుతున్నారు .మొత్తం 30 గ్రామాల్లో 19 వేటకు అనుకూలంగా ఉన్నాయని తేల్చారు .మంచిర్యాల జిల్లాల్లో పొక్కుర్ , శివ్వారం , సోమనపల్లి, పెద్ద పల్లి జిల్లా లో ఆరెండా , మంథాని , బేస్తపల్లి , విలోచవరం , సుందిళ్ల , ముస్త్యాల , జనగామ , గుంజపడుగు , రాయదండి భూపాలపల్లిలో , కాళేశ్వరం ,సూరారం, అన్నారం ,రేపల్లె కోట , మహాదేవ్ పూర్ , అంబటి పల్లి ప్రాంతాలు చేపల వేటకు అనుకూలమని నిర్ధారించారు . ప్రారంభం ఎక్కడంటే చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి కాళేశ్వరం నుంచే మొదలు పెట్టె అవకాశం ఉందని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు . మేడిగడ్డ , అన్నారం లేదా అన్నారం సుందిళ్ల మధ్య ఎక్కడో ఒక చోట పిల్లలు వదిలే అంశాన్నిపరిశీలిస్తామన్నారు ఇప్పటికి ఆశించిన సదాయూలో వర్షాలు లేక చాలా వరకు చెరువుల్లోకి నీరు రాలేదు .అందుకే కాళేశ్వరంలోనే పంపిణి ప్రారంభించాలని భావిస్తున్నాం . ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ , ముఖ్యమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం అని ఆయన వెల్లడించారు .
Source : eenadu