For Advertisement Enquiries Please Contact +91 7901268899

వెనామీ విలవిల

img

నాసిరకం సీడ్ పుణ్యమా పట్టుమని నెల కాకముందే పిల్ల రొయ్యలు చనిపోతున్నాయి. కొద్దో గొప్పో బతికి బయటపడ్డా ఎదుగుదల అంతంత మాత్రమే సిండికేట్ గా మారిన వ్యాపారులు ధరలు తగ్గించి మరీ కొనుగోలు  చేస్తుండటంతో గిట్టుబాటు రాక రొయ్య రైతులు నిండా మునిగే పరిస్ధితి నెలకొంది. నాణ్యమైన సీడ్  అందేలా చూడాల్సిన కోస్టల్  ఆక్వా అధారిటీ , మత్య్సశాఖలు మామూళ్ల  మత్తులో పడి రైతుల గోడు పట్టించుకోవడం లేదు. మొత్తంగా జిల్లాలో ఆక్వా సాగు సంక్షోభంలో  పడింది.
జిల్లాలో సింగరాయకొండ ,టంగుటూరు , ఒంగోలు, ఆగులుప్పలపాడు, చిన గ్మ్జాం , వేటపాలెం, చీరాల తదితర మండలాల్లో దాదాపు 20 వేల హెక్టార్లల్లో రైతులు వెనామీరొయ్యలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఉలవపాడు, సింగరాయకొండ , టంగుటూరు, మండల్లా రైతులు మన్నేరు , పాలేరు లపై ఆధరపడగా మిగిలిన మండలాల రైతులు రొపేరు, బకింగ్ హామ్  కెనాల్ పై ఆధారపడి రొయలు సాగు చేస్తున్నారు. ఆటుపోట్లు ద్వారా సముద్రంనుంచి వచ్చే ఉప్పునీరు ఆధారంగానే రొయ్యల సగవుతోంది. ఏటా సగటున 30 వేల టన్నుల రొయ్య విదేశాలకు ఎగుమతి అవుతోంది.
పతనమైన రొయ్యల ధరలు:
ఇటీవల రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నెలరోజులతో పోలిస్తే రొయ్యల ధరలు మరింత తగ్గాయి. ఉదా: నెలరోజుల క్రితం 50 కౌంటు రొయ్య రూ. 410ఉండగా ప్రస్తుత్తం రూ. 330 కు చేరింది. 60 కౌంటు రూ. 380 నుంచి. రూ. 300 కు 70 కౌంటు రూ. 340 నుంచి రూ. 250 కు, 80 కౌంటు రూ. 320 నుంచి. రూ. 260 కు చేరింది. ప్రధానంగా రైతుల వద్ద ఉన్న 50,60,70,80, కౌంటూ రొయ్యల ధరలు రూ. 60 నుంచిరూ. 90 వరకు తగ్గడం గమనార్హం.  దీంతో రైతులు తీవ్రంగా నష్టపో యే పరిస్ధితి నెలకొంది.
నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు సిండికేట్:
వ్యాపారులు సిండికేట్ గా మారి రొయ్యల ధరలు తగ్గించినట్లు  తెలుస్తోంది. రెండు నెలల క్రితం  యూరోపియన్ దేశాలకు వ్యాపారులు ఎగుమతి చేసిన రెండు కంటైనర్ల రొయ్యలు వెనక్కి తిరిగి వచ్చాయి. నాణ్యాత ప్రమాణలు సరిగ్గా పాటించలేదన్నకారణాలతో పాటు పలు కారణాలు చూపి రొయ్యలను వారు వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు రొయ్యల ధరలను భారీగా తగ్గించినట్లు సమాచారం మరోవైపు రొయ్యల ఉత్పత్తి ఈ ఏడాదిగణనీయంగా తగ్గింధి  ప్రస్తుత్తం వైట్ స్పాట్  వ్యాధిసోకడంతో రొయ్యలు చనిపోతున్నాయి.
నాసిరకం సీడ్ విక్రయాలు
జిల్లాలో అధికారికంగా 24 రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటిలో చాలా కేంద్రాలు రైతులకు నాణ్యత లేని రొయ్యపిల్లలను విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. నిబంధనల మేఅరకు పసిఫిక్ మహా సముద్రంలో క్రాసింగ్ చేసిన తల్లి రొయ్యలను భారత  ప్రభుత్వం దిగుమతిచేసుకోని చెన్నె నుంచి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకొని ప్రాసెసింగ్ ద్వారా పిల్లలను ఉత్ప్త్తి చేసి నాణ్యతాప్రమాణాలు తగ్గకుండా రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. ఒక్క తల్లి రొయ్య నుంచి కేవలం 4 విడతల్ పిల్లలను మాత్రమే ఉత్పత్తి చేయాలి. ఆతర్వాత పిల్లల్ని ఉత్పత్తి చేసినా వాటికి రోగ నిరోధక శక్తి ఉండదు.చిన్న జబ్బులను తట్టుకొలేకమృతి చ్కెందేఅవకాశం ఉంది. ఒక వేళ బతికి బయటపడ్డా ఎదుగుదల ఉండదు.
అయితేజిల్లాకు చెందిన పలు హాచరీస్ తల్లి రొయ్యలను 5 నుంచి పది సార్లు వరకు ఉత్పత్తి చేసిన రొయ్య పిల్లలను రైతులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు స్ధానిక చెరువుల్లో పెంచిన తల్లి రొయ్యల నుంచి పిల్లలనుఉత్పత్తి చేసి నాణ్యత లేని పిల్లలను రైతులకు అంటగడుతున్నట్లు సమాచారం దీనివల్లే సాగులో 40 శాతం పిల్లలు నెల రోజుల్లోపే చనిపోతున్నట్లు తెలుస్తోది..నాణ్యమైన పిల్ల రొయ్య అయితే 120 రోజులకే 30 కౌంటు రావాలి , కానీ 130 ను,మ్చి 150 రోజులకు పెంచినా 50 కౌంటురావడం లేదు.మొత్తం మీద పదిశాతం కూడా నాణ్యత కలిగిన పిల్లలను హెచరీస్ రైతులకు సరఫరా చేయడంలేదన్న ఆరోపణలున్నాయి .
Source: sakshi

 

Languages

Shares

Related News