For Advertisement Enquiries Please Contact +91 7901268899

వ్యాధులు వాటి లక్ష్యణాలు(హెపాటోపాంక్రియాటిక్ మైక్రోస్పోరిడియోసిస్ (HPM))

img

వ్యాధి లక్షణాలు :
సాగు చెరువులో వ్యాధి లక్షణాలు :
•పిల్లల పెరుగుదల చాలా తక్కువగా వుంటుంది.
•పిల్లలో పెరుగుదల సక్రమంగా లేకపోవుట వలన
•తెల్లని రంగు కలిగి నీటిపై తేలుతున్న విసర్జకాలు గుర్తించాలి.
•రొయ్యలు తక్కువ సమయంలో మరణిస్తాయి.
వ్యాధిని సంక్రమించే జీవులు:
•ఈ వ్యాధికారకం మైక్రోస్పోరిడియో చెందిన పరాన్నజీవు ఎంటిరోక్రిప్టోజూన్ హెపాటోపినియైగా గుర్తించారు.
వ్యాధి నిర్ధారించు పద్ధతులు :
• పిసిఆర్ పద్ధతి వుపయోగించి గుర్తించవచ్చు.
•పిసిఆర్ టెస్ట్ వుపయోగించి హెపాటోపాంక్రియాస్ మరియు రొయ్యలు వదిలిన విసర్జకాలు గుర్తించవచ్చు.
•హిస్టోపాధాలజీ
ఈ వ్యాధి సోకే రొయ్యలు :
•పీనియస్ మోనోడాన్ మరియు పి.వనామీ రొయ్యలకు ఇ.హెచ్.పి సోకుతుంది.
వెక్టార్ :
•ఈ వ్యాధిని చేరవేసే జీవులను గుర్తించబడలేదు.
వ్యాధి వ్యాపింపజేసే పద్ధతి:
•హారిజంటల్ మరియు వర్టికల్
•ముఖ్యంగాఈ వ్యాధి ఆహార మార్గం ద్వారా వ్యాపిస్తుంది. మరియు అవి రొయ్యలు వదిలిన విసర్జకాల ద్వారా  ఈ వ్యాధి సంక్రమింస్తుంది.
•చెరువు అడుగు భాగమున ఏర్పడిన నల్లని మట్టిలో ఉన్న ఇ.హెచ్.పి. స్పోర్లు ద్వారా విస్తరిస్తుంది.

యాజమాన్య పద్ధతులు:
•హేచరీలలో వినియోగించే మేతలను , ఆర్టిమియాను పిసిఆర్ పరీక్ష జరిపి ఇ.హెచ్.పి. గుర్తించాలి.
•సాగు చెరువులో ఇ.హెచ్.పి సోకని పిల్లలను స్టాక్ చేయాలి.
•ఆరోగ్యవంతమైన మరియు బలమైన పిల్లలను ఎంచుకోవాలి.
•పోస్టు లార్వాలను నర్సరీలలో పెంచాలి.
•సాగు చెరువులో పిల్లలను స్టాక్ చేసే  సమయానికి చెరువుల్లో ప్లవకాలు బాగా అభివృద్ధి చెంది వుండాలి.
•ఒక చెరువులో ఇ.హెచ్.పి సోకి ఉన్నట్లయితే రొయ్యల సాగు మరలా చేపట్టేటప్పుడు కింద సూచించిన మట్టీ ట్రీట్ మెంట్ జరపాలి.
•ఇ.హెచ్.పి. స్పోర్లు కవచాలు చాలా దళసరిగా వుంటాయి. అందువలన వాటిని తోలగించటం  చేయటం తేలిక కాదు.ఎక్కువ మోతాదులో క్లోరిన్ వాడిన ఆశించిన ఫలితం ఉండదు.
•చెరువు సెడిమెంట్ ట్రీట్ మెంట్ జరపుటకు Cao ఒక హెక్టార్ విస్తీర్ణానికి 6 టన్నుల చొప్పున వాడాలి.
•చెరువు అడుభాగం ఎండిన తరువాత దానిని 10-12 సెం.మీ. లోతు వరకు దున్నించి తరువాత తడి చేయడం వలన సున్నం ఆక్టివేట్ అవుతుంది.
•ఆ నేలను ఒక వారం రోజులు ఎండనివ్వాలి.
•సున్నం అప్లయ్ చేసిన తరువాత నేలయొక్క pH,12 లేక ఎక్కువగా 2  రోజుల వరకు ఉంటుంది. ఆ తరువాత pH సామాన్య స్ధాయికి చేరి, కార్బన్ డై ఆక్సైడ్ ని పీల్చుకుని CaCo3 గా మారుతుంది.

 

Languages

Shares

Related News