ఆక్వా రంగం ప్రమాదపు అంచుల్లో ఉంది.విచ్చల విడిగా యాంటీబయోటిక్స్ వాడడం వల్ల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒక కంటైనర్ వెనక్కు వస్తే పదిహేను శాతం ధర తగ్గించుకొని అమ్ముకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఆక్వా రైతులు విచక్షణతో వ్యవహరించాలి. సాగులో నిషేధిత యాంటీబయోటిక్స్ చూసుకోవాలి. అని మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్ ఉద్భోధించారు . జిల్లా మత్స్యశాఖ ఆద్వర్యంలో మంగళవారం స్ధానిక రెవిన్యూ డివిజినల్ కార్యాలయ ఆవరణలోని ఎన్ టీ ఆర్ కాళాక్షేత్రంలో ఆక్వా రైతులు, వ్యారులు , కంపెనీ ప్రతినిధులతో ఆక్వా సాగులో నిషేధిత యాంటీబయోటిక్స్ పై ఏర్పాటు చేసిన అవగాహన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని పలు సూచనలు చేశారు. నిర్ణీత సమయానికంటే అధిక దిగుబడి రావాలన్న ఉద్దేశంతో కొంతమంది రైతులు నిషేధిత యాంటీబయోటిక్స్ వాడటంపై ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆందోళ వ్యక్తం చేశారు. ప్రో బయోటిక్స్ పేరుతో రకరకాల మందులు వాడుతున్నారని , వైరస్ పేరుతో నిషేధిత యాంటీబయోటిక్స్ వినియోగిస్తుండటంతోఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు..
భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న రొయ్యల్లో ఆంద్రప్రదేశ్ కు చెందినవే ఉంటూన్నాయని మత్స్యశాఖ కమిషనర్ వెల్లడించారు. . అయితే ఈ ఎగుమతుల్లో నిషేధిత యాంటీబయోటిక్స్ ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ గుర్తించిందన్నారు. రాష్ట్రంపై యూరోపియన్ యూనియన్ కన్నుపడిందన్నారు. నవంబర్20 నుంచి 25 వ తేదీలోపు యూరోపియన్ యూనియన్ కు చెందిన బృందం రాష్ట్రంలో పర్యటించనుందని , ఇది ఆంధ్రాకు అగ్నిపరీక్షేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టంలో 55 వేల హెక్టార్లలో అదనంగాఆక్వా సాగు చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నతరుణంలో యూరోపియన్ యూనియన్ బృందం రాష్ట్రానికి వస్తున్న నేపధ్యంలో రైతులు అప్రమత్తంగాఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఫారంస్ తప్పకుండా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు. అంతకు ముందుగా మత్స్యశాఖ అధికారులు క్లస్టర్ స్ధాయిలో ఆక్వా రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఒక్కోశాఖ గిరిగీసుకొని పనిచేయడంవల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ,చతుర్ముఖ వ్యుహంతో ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సంబంధితశాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
Source : sakshi