గమళ్లపాలెం : రొయ్యల హేచరీని కలెక్టర్ వి. వినయ్ చంద్ మంగళవారం పరిశీలించారు. మండల పర్యటనలో భాగంగా గమళ్లపాలెంలోని రవి హేచరీని సందర్శించి రొయ్య పిల్లల పెంపకం గురించి వివరాలు అడీగి తెలుసుకున్నారు. రొయ్యల బ్రూడర్ గదిని పరిశీలించి ఎన్ని సార్లు గుడ్లు పెడతాయనేవివరాలు అడిగి తెలుసుకున్నారు. రొయ్యల గుడ్లు , పిల్లలను పరిశీలించారు. ఎంత ఉప్పు శాతంలో పెంచుతున్నారు? ఎంతకు అమ్ముతున్నారు. అనే విషయాలు తెలుసుకున్నారు. గోదావరి జిల్లాల నుంచి రొయ్య పిల్లలను ఎందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఎందుకు వేయడం లేదని అడీగారు. జిల్లాలో ఎన్ని హేచరీలు ఉన్నాయో తెలుసుకున్నారు. కార్యక్రమంలోమత్స్య శాఖ సమ్యుక్త సంచాలకులు ఎం. బలరా6, నియోజక వర్గ ప్రత్యేక అధికారిణి అన్నపూర్ణమ్మ ,మత్స్య శాఖ సహాయ సంచాలకులు రంగనాధ బాబు, ఒంగోలు సహాయసంచాలకులు చంద్రశేఖర్ , అధికాఅరులు పాల్గొన్నారు.
Source : sakshi