ఒంగోలు: ప్రకాశం జిల్లాను ఆక్వా కల్చర్ కు మోడల్ గా ఎంపిక చేశారు. ఆక్వా రంగానికి సంబంధించి ఈ జిల్లాలో ఏమి చేస్తామో దేశ వ్యాప్తంగా అమలవుతోంది. అంతటి ప్రాధాన్యత కలిగిన ప్రకాశంలోని రొయ్య రైతులకు నాణ్యమైన పిల్లలను సరఫరా చేయాలి. యాంటీబయోటిక్స్ రహిత మందులను అందించాలి. ఆక్వా రంగమ్లోని రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చూడాలని కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ మెంబర్ సెక్రటరీ డాక్టర్ సీ గోపాల్ ఉద్బోధించారు. రొయ్యల సాగులో సుస్ధిరపర్యావరణ యాజమాన్య పద్దతులపై జిల్లాలోని ఆక్వా రైతులకు హేచరీ యజమానులకు ,ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులతో మంగళవారం స్ధానిక ఆర్టివో కార్యాలయ ఆవరణలోని ఎన్ టీఆర్ కళాక్షేత్రంలో సదస్సునిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి అధిక దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా ఆక్వా చెరువుల్లో రొయ్యపిల్లలను వదిలితే నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మత్స్య శాఖ జాయింట్ డైరక్టర్ బలరాం మాట్లాడుతూ సాగు చేసుకుంటున్నామో , పర్యావరణ పరిరక్షణకు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలనిసూచించారు.
రొయ్య రైతులను రక్షించాలి:
జిల్లాలోని రొయ్య రైతులను రక్షించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శిదుగ్గినేని గోపినాధ్ కోరారు. నాణ్యత లేని సీడ్ ను రైతులకు అంటగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.
Source ; sakshi