For Advertisement Enquiries Please Contact +91 7901268899

రేటుంది...... రొయ్యలేవి !

img

రొయ్య రైతులను వంచించేందూ వ్యాపారులు సిద్దమయ్యారు. రైతుల దగ్గర పంట ఉన్నప్పుడు ధరలు దారుణంగా తగ్గించిన వ్యాపారులు తీరా రైతుల వద్ద పంట లేనప్పుడు ధరలను అమాంతం పెంచేశారు. ధరలు పెరిగిన ప్రస్తుతం రైతులకు ఉపయోగం లేకుండా పోయింది.. వానాకాలం పంట సాగును పెంచే ఆలోచనతోనే వ్యాపారులు ధరలను పెంచినట్లు తెలుస్తోంది. గత పంటకాలంలో రొయ్యల ద్హర్లు పూర్తిగాపడిపోయాయి. రైతులు లక్షల్లో నసఃటపోయారు. దీంతో ఈ ఏడాది వానా కాల్మ్ సాగుసగానికి సగం తగ్గిపోయే పరిస్ధితి నెలకొండి . ఇది గమనించిన రొయ్య వ్యాపారులు  రైతుకు ఆశచూపి రొయ్య సాగు పెంచేందుకు వ్యూహం రచించారు. ఇందులో భాగంగా రొయ్యల ధరలను అమాంతం పెంచారు. నాలుగు రోజుల్లో రొయ్యల ధరలు ఇబ్బడి ముబ్బడిగాపెరిగాయి అయితే ప్రస్తుతం రైతుల వద్ద పంట లేకపోవడం గమనార్హం . పంట సాగు చేస్తే దిగుబడి నాటికి రొయ్యధరలు ఉంటాయన్న ఆశ కల్పించేందుకు వ్యాపారుల సిండికేట్ కొత్త ఎత్తుగడకుసిద్దమైనట్లు తెలుస్తోంది.  రొయ్యల  వ్యాపారులతో అధికంగా మార్జిన్ తీసుకుని వ్యాపారులు లాభాలు అర్జిస్తుంటే రైతులు లక్షల్లోనష్టపోయి లబోదిబో మంటున్నారు.. 
30 వేల ఎకరాల్లో సాగు ....ప్రకాశం జిల్ల పరిధిలో వేటపాలెం , కొత్తపట్నం , ఒంగోలు రూరల్,సింగరాయకొండ , టంగుటూరు, చినగంజాం , చీరాల, ఉలవపాడు , గుడ్లూరు, నాగలుప్పలపాడు , జరుగుమల్లి తదితర 11 ప్రాంతాల్లో 30 వేల ఎకరాల్లో రైతులురొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో 40 శాతం రొయ్యలు అమెరికాకు వెళ్తుండగా మిగిలినవి. చైనా , జపాన్, ధాయ్లాండ్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గతంలో 20 శాతం రొయ్యలు యూరప్ కు ఎగుమతి చేసేవారు. అయితే యాంటీబయోటీక్స్ పరీక్షలు కఠినంగా నిర్వహించాడంతో 15 ఎగుమతి కంపెనీలను యూరోప్నిషేధించింది.కిలో ఉత్పత్తికి రూ. 40 నష్టం ...
రొయ్యల ధరకంటేవాటీ ఉత్పత్తికి అయ్యే ఖర్చు అధికంగా ఉంటోంది, ఉదాహరణకు రెండు టన్నుల ఫీడ్ ఖర్చు రూ. 1.50 లక్షలు అవుతుండగా సీడ్ ఖర్చు రూ. 15 వేలు ,కరెంట్బిల్లు రూ. 50 వేలు ఫీడ్బాయ్ జీతం రూ. 50 వేలు , మెడిసిన్ రూ. 40 వేలు , జనరేటర్స్, ఏడియేటర్స్ఖర్చు మరో రూ . 60 వేలువస్తోంది. ఈ లెక్కన కొలో రొయ్య ఉత్పత్తికి సగటున రూ. 420 నుంచి రూ. 450 వరకు ఖర్చు వస్తుంది. కానీ , ఈఏడాది తొలి పంటలో రొయ్య ధరలను పరిశీలిస్తే కిలోకు రూ. 30 నుంచి రూ. 40 వరకు నష్టాలు వచ్చాయి. ఎగుమతుల విషయంలో  గతంలో వ్యాపారులు రైతుల విషయంలొ గతంలో  వ్యాపారులు రైతుల వద్ద కొలోకు అర డాలర్ మాత్రమే మార్జిన్ తీసుకునేవారు. ఇప్పుడు 2 డాలర్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. రెండెళ్ల క్రితం విదేశాల్లో కిలో 30 కౌంటు రొయ్య 13 డాలర్లకు తక్కువకాకుండా అమ్ముడయింది.అప్పడూ 30 కౌంటు రొయ్యలను వ్యాపారులు రైతులవద్ద రూ. 480వరకూ కొన్నారు .ఈ ధరలతో రైతుకు కొతమేర లాభం ఉండేది. వ్యాపారులు కూడా అర డాలర్ మాత్రమే మార్జిన్ తీసుకునే వారు కాని ఇప్పుడు పరిస్దితి అందుకు భిన్నంగా మారింది. వ్యాపారులు 2 శాతం మార్జిన్ తీసుకుంటుండడంతో రైతుకు నష్టాలు తప్పడం లేదు  ప్రస్తుత పరిస్ధితుల్లో 30 కౌంటు రొయ్య ఉత్పత్తి లేదు 100 నుంచి 50 కౌంటు వరకు మాత్రమే ఉత్పత్తి ఉంది. వీటినే వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అదే సమయంలోరొయ్యల ద్హరలు పతనమయ్యాయి. రొయ్య కిలో ఉత్పత్తి ఖర్చుకు ప్రస్తుతం మార్కెట్ లో రొయ్య ధరకు చాలా వ్యత్యాసం ఉంది. దీంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. కాని వ్యాపారులకు మాత్రం కిలోకు రెండు డాలర్లకు తక్కువలేకుండాలాభం ఉంటోంది. 
చోద్యం చూస్తున్న మత్స్య శాఖ...
ఎగుమతులకు సంభంధించి ధరల నియంత్రణ విషయాన్ని పర్యవేక్షించి రైతులకు లాభం ఉండేలా చాడాల్సిన మెరైన్ ఎగుమతి అధారిటీ పట్టించుకోవడం లేదు. రొయ్య రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్రమత్స్య శాఖ , కేంద్ర పరిధిలోని  ఆక్వా అధారిటీ ఆఫ్ ఇండియాలు తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోయాయి. గతఏడాది భారీ నష్టాలు చవి చూసిన రొయ్య రైతులు వానా కాలం సాగును  తగ్గించేందుకు సిద్దమయ్యారు. దీంతో వానాకాలం పంట భారీగా తగ్గనుంది. ఇది గమనించిన వ్యాపారులుమరోమారురొయ్య రైతులను వంచించేందుకు వ్యూహత్మకంగా ధ్రలను పెంచారన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Source : sakshi

Languages

Shares

Related News