విధ్యుత్ సబ్సిడీ పరిమితి పెంపు
అమరావతి : ఆక్వా రైతులకు ప్రభుత్వం మరో మేలు చేసింది . ప్రస్తుతం అయిదెకరాల వరకు ఉన్న విధ్యుత్ సబ్సిడీ ని పదెకరాల వరకు పెంచుతూ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె . విజయానంద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు . ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైస్ జగన్ ఆక్వా రైతులకు సబ్సిడీ విధ్యుత్ ఇస్తామని ప్రకటించడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం యూనిట్ ను రూ .2 కు ఇస్తామని 2018 లో 4 నెలల పాటు ఇచ్చింది .జగన్మోహన్ రెడ్డి సీఎం అయినతర్వాత 2019 జూలైనుంచి ఆక్వా రైతులకు యూనిట్ విధ్యుత్ ను రూ .1 .50 కే ఇస్తున్నారు .ఐదెకరాలకు పైన ఉన్న ఆక్వా రైతులకు యూనిట్ ను రూ . 3 .85 కి ఇస్తున్నారు .వారికి కూడా సబ్సిడీ పెంచాలనే ఉద్దేశంతో అయిదెకరాలకు వరకు ఉన్న రేటుని పదెకరాలవరకు ఉన్న ఆక్వా రైతుల నుంచి వసూలు చేయనున్నారు .
source : sakshi