For Advertisement Enquiries Please Contact +91 7901268899

జాతీయ స్థాయి ఉత్తమ మెరైన్ జిల్లాగా కృష్టా

img

ఆక్వా రంగంలో కృష్టా జిల్లా మంచి పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో ... జాతీయ స్థాయిలో ఉత్తమ మెరైన్ జిల్లాగా ఎంపికైనట్లు కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు ..  దేశ స్థాయిలో అసోంలో నాగాం , ఒడిశా లో కలహండి , ఏపీలో కృష్టా ... మొత్తం మూడు జిల్లాలు ఎంపికైనట్లు పేర్కొన్నాడు . ఈ నెల 21 వ తేదీన అంతర్జాతీయ మత్య్స కార దినోత్సనమని , ఈ సందర్భంగా ఎంపికలు జరిగాయన్నారు . జాతీయ స్థాయి అవార్డు ప్రధాన  కార్యక్రమాన్ని 21 న దిల్లీలో నిర్వహస్తారని వివరించారు . అవార్డు కింద రూ .3 లక్షల నగదు బహుమతి , ప్రశంసా పత్రాన్ని అందిస్తారని చెప్పారు . నగరంలోని విడిది కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడారు . 8 లక్షల టన్నుల చేపలు , రొయ్యలను ఉత్పత్తి చేసి , రాష్ట్రంలో జిల్లా ప్రధమ స్ధానంలో నిలిచినట్లు తెలిపారు .జిల్లాలో 111 కిలో మీటర్లు మేర సముద్ర తీరం ఉందన్నారు .49 వేల హెక్టార్లలో మంచి నీటి 19 వేల హెక్టార్లలో ఉప్పు నీటి చేపల పెంపకం ఉన్నట్టు వివరించారు . కరోనా నేపథ్యంలో 4800 మంది రైతులకు రవాణా అనుమతుల కోసం పాసులను జారీ చేసినట్లు తెలిపారు .మత్స్య సాగు బడి కింద నైపుణ్యం గల 100 మంది ఆక్వా రైతులను ఎంపిక చేసి , వారి ద్వారా మిగిలిన రైతులను శిక్షణ ఇప్పించినట్లు పేర్కొన్నారు .కరోనా నిబంధనలు పాటిస్తూ , 9 ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు ద్వారా 6500  టన్నుల రొయ్యలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసి , మార్కెటింగు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు .ఆర్ ఐ .డి ఎస్ . పధకం కింద కొత్త తుమ్మలపాలెం , కానూరు , సొర్లగొంది , పోలాటితిప్ప , నాగాయలంక గ్రామాల్లో షోర్  బెస్ట్ ఫెసిలిటీ సెంటర్లను ఒక్కోక్కటి రూ .కోటితో నిర్మిస్తున్నట్లు చెప్పారు .
source : eenadu

Languages

Shares

Related News