అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని తొమ్మిది కోస్తా జిల్లాలో ఆక్వా జోన్లు ఏర్పాటు చేయడంతో పాటు వ్యవసాయ భూముల్లో అనధికారకంగా తవ్విన చేపల చెరువులపై సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.పరిస్ధితులను బట్టి చేపల చెరువులపై నిషేధం విధించడం గానీ, క్రమబద్ధీకరించడం గానీ చేయనుంది. ఆక్వాప్రభావంతో వ్యవసాయ భూములు, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలనీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది.
ఆక్వా రంగ సుస్ధిర అభివృద్ధి సాధించే లక్ష్యంతో9కోస్తా జిల్లాల్లో ఆక్వా జోన్లు ఏర్పాటు , ఆక్వా జోన్లలో విధ్యుత్తు లైన్లు, రహదారులు, కాలువలు , ఇఅతర మోలిక సదుపాయాల కల్పన , తద్వారా పర్యావరణ సమతుల్యం కాపాడుతూ ఉత్పాదక సామర్ధాన్ని, ఎగుమతులనుపెంచడం. అవరోధాల్లేని ఆన్ లైన్ లైసెంసింగ్ అనుమతుల విధానాన్ని తీసుకొచ్చి ఆక్వా రంగం అభివృద్ధి .జోన్ల ఏర్పాటుతో 1,95,971హెక్టార్లలో 93,864 మంది ఆక్వా రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి.
Source : eenadu