ఈవైరస్ వ్యాధి లక్షణాలు :
•ఈ వ్యాధి సోకిన రొయ్య పిల్లలు మేతను చాలా తక్కవగా తీసుకొనడంతో పాటుగా వాటి చలనము మరియు శరీరంలో మార్పులు చూపిస్తాయి.
•ఈ వ్యాధి సోకిన రొయ్యల అబ్డమిన్ (ఉదర భాగం) వంకరగా ఉంటుంది . దీనిని రంట్ డి. ఫార్మటి సిండ్రోమ్ అని పిలుస్తారు. IHHNV వైరస్ వ్యాధి వున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది
ఈ వ్యాధిని పి.వనామీ రొయ్యలలో గమనిస్తాము.
•ఈ వ్యాధి సోకిన రొయ్య పిల్లలో రోష్ట్ర భాగం వంగి వుంటుంది. అబ్డామిన్ భాగంలోని ఆరవ్ సెగ్మెంట్ రూపం మార్పుకు లోనవుతుంది. ఆంటిన్నా ప్లాజెల్లా వంకర తిరిగి వుంటాయి. శరీరంపైవున్న క్యూటికల్ గరుకుగా మారుతుంది మరియు చిన్న చిన్న గుండ్రని కణితలు ఏర్పడతాయి.
•ఈ వ్యాధి సోకిన రొయ్య పిల్లలో ఒకే విధమైన పెరుగుదల ఉండదు. చాలా రొయ్య పిల్లలను చిన్న సైజులో వుంటాయి.వీటిలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది.
ఈ వ్యాధిని కలిగించే వైరస్ :
•పీనియస్ స్టైలిరోస్ట్రిస్ డెసో వైరస్.IHHNV
వ్యాధిని వ్యాపింపజేసే జీవులు :
•ఈ వ్యాధిని వ్యాపింపజేయుటలో ఏ జీవులను గుర్తించ లేదు.
ఈవ్యాధి ని వ్యాపింపజేసే ప్రకృతిలోని ఆక్వాటిక్ జీవులు:
•ప్రకృతిలో నివసించే పి.మోనోడాన్ , పొ.వన్నామీ జాతికి చెందిన రొయ్యలు మరియు ప్రకృతిలో నివసించే ఇతర పీనిడ్ రొయ్యల జాతులలో IHHNV ఉంటుంది.
ఈ వ్యాధి వ్యాపింపజేసే పద్ధతి:
•ఈ వ్యాధి హారిజంటల్ మరియు వర్టికల్ మార్గాలలో వ్యాపిస్తుంది.
•హారిజంటల్ పద్ధతిలో వ్యాప్తి :వ్యాధి కారక జీవులతోవున్న మరియు వ్యాధి కలిగించే వైరస్ లను కలిగిన జీవులను ఆహారంగా తీసుకొనడం వలన.
•వర్టికల్ పద్ధతిలో వ్యాప్తి: వ్యాధి కారక వైరస్ లతో ఇంఫెక్ట్ అయిన రొయ్యల గుడ్ల ద్వారా.
వ్యాధిని గుర్తించు పద్ధతులు:
•పిసిఆర్ పద్ధతి
•కణజాల పరీక్షలు
వ్యాధి యాజమాన్య పద్ధతులు :
•వ్యాధి కారక వైరస్ లేని ఎస్.పి.ఎఫ్. మరియు పిసిఆర్ పద్ధతి వుపయోగించి వైరస్ సోకని పిల్లలను గుర్తించడం.
•ఇతర యాజమాన్య పద్ధతులు(తెల్ల మచ్చ వ్యాధి నిరోధనలో వుపయోగించు పద్ధతులు)