For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఆక్వాకు  మంచి రోజులు 

img

పాయకరావు పేట : రాష్ట్రంలో ఆక్వా రంగానికి మంచి రోజులు రాబోతున్నాయి .నాణ్యమైన తల్లి రొయ్యల ఉత్పత్తి కేంద్రం రాష్ట్రానికి మంజూరైంది . ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఇటువంటి కేంద్రం తమిళనాడులోని  చెన్నైలో మాత్రమే ఉంది .నాణ్యమైన రొయ్య పిల్ల ఉత్పత్తికి అవసరమైన తల్లి రొయ్యను తెచ్చుకోవడానికి చెన్నై వెళ్లాల్సి వస్తోంది . ఇకపై ఆ ఇబ్బంది లేకుండా ...విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారయ్య పేటలో ఆక్వా ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది . ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 30 ఎకరాల భూమిని కేటాయించింది . సుమారు రూ.50 కోట్లతో నిర్మించే ఈ కేంద్రానికి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు బుధవారం శంకుస్ధాపన చేయనున్నారు . ఇప్పటికే నక్కపల్లి మండలం రాజయ్య పేటలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ను ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేశారు . తాజాగా ఆక్వా క్వారంటైన్ ల్యాబ్ నిర్మాణానికి పునాది రాయి పడుతుండటంతో ఆక్వా రంగానికి మంచి రోజులు వచ్చినట్టేనని రైతులు , హేచరీల నిర్వాహకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు .
వెయ్యి కోట్ల రొయ్య పిల్లల ఉత్పత్తి 
1 .ఇక్కడ నిర్మించే కేంద్రంలో తల్లి రొయ్య లో నిర్దిష్ట వ్యాధికారక స్ధితిని నిర్ధారించడం , పశుసంవర్ధక , మత్స్య శాఖ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ చేస్తారు . 
2. తద్వారా కఠినమైన బయో సెక్యూరిటీ , ప్రొటొకాల్స్ ను అనుసరించి నాణ్యమైన , వ్యాధిలేని తల్లి రొయ్యలను హేచరీలకు అందిస్తారు .
3 . ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ లో ఏడాదికి 6 నిర్బంధ గదులతో నిర్దిష్ట ప్రణాళికలతో  1,23,750 బ్రుడర్లను పరిశిలించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు .ఇందులోని ల్యాబ్ ద్వారా 10 బిలియన్ల రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తారు .
4. ఇక్కడ తల్లి రొయ్యల స్ధితి గతులను నేషనల్ ఫిషరీస్ బోర్డు , సిఐబీఏ ఎంపెడా , ఆర్జీసిఏ, ఏక్యూ ,డీఏడీఎఫ్ వంటి సంస్ధలతో ఏర్పాటైన సాంకేతిక బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది .
5 . తల్లి రొయ్యల సరఫరాతో పాటు రొయ్య పిల్లల పెరుగుదల , వ్యాధి నిరోధకత , ఫీడ్ కన్వర్షన్ వంటి క్షేత్ర స్ధాయి పరిశీలనలు కూడా ఇక్కడ జరుగుతాయని మత్స్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు .
source : sakshi
 

Languages

Shares

Related News