ఒంగోలు టౌను: నాసిరకం రొయ్య పిల్లల ఉత్పత్తిని అరికట్టి రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగారైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాధ్ మాట్లాడుతూ జిల్లాలో 50 వేల ఎకరాల్లో రైతులు రొయ్యలు సాగు చేస్తున్నారన్నారు. కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీఅనుమతి పొందిన36 హేచరీల నుంచి రైతులు రొయ్య పిల్లలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. గత రెండెళ్లు నుంచి కోస్ట్ల్ ఆక్వా కల్చర్ అధారిటీ నుంచి సరఫరా అవుతున్న తల్లి రొయ్యలను కొన్నిహేచరీలు 10 నుంచి 15 సార్లు రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో తల్లి రొయ్యనుంచి ఐదు సార్లు కంటే ఎక్కువ రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తేఉత్పత్తి అయ్యే రొయ్యపిల్లలు బలహీనంగా ఉండిసరైన ఎదుగుదల లేక జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కొన్ని హేచరీలుస్ధానికంగా తల్లి రొయలను పెంచి వాటినుంచి రయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఆ రొయ్య పిల్లలు సాగుచేసిన రొయ్యలఎదుగుదల లేక, సర్వ్ లు సక్రమంగా ఉండక, వైట్గట్ , వైట్ స్పాట్ వంటి జబ్బులు సోకి ఎకరాకు 3 నుంచి 4 లక్షల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా జిల్లాలో గత రెండెళ్లు నుంచి ప్రతి ఏటా 20 వేల ఎకరాల్లో పంట దెబ్బతిని ముత్తంగారైతులు 700 కోట్ల రూపాయలు నష్టపోయరన్నారు.
నాసిరకంరొయ్యపిల్లల తయారిని అరికట్టాల్సిన మత్స్య శాఖ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ చోద్యం చూస్తున్నారని వమర్శించారు. రాష్ట ప్రభుత్వం కూడా డబుల్ డిజిట్ అంటూ హడావిడిచేయడం తప్పితే నాసిరకం రొయ్యపిల్లల ఉత్పత్తిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలుతీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉత్పత్తి అవుతున్న నాసిరకం రొయ్యల ఉత్పత్తిని అరికట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కొత్తగా రొయ్యల సాగు చేపట్టిన వారికి లైసెన్స్ లు పెండింగ్ లో ఉన్నాయని , కొత్త చెరువులక్ లైసెన్స్ లు మంజూరు చేస్తే వారు విద్యుత్ కనెక్షన్ పొంది రొయ్యలుఉత్పత్తి చేసుకుంటారని గోపినాధ్ పేర్కొన్నారు. ధర్నాలో రైరు సంఘం జిల్లా నాయకులు కే. వీరారేడ్డి, చిన్నం అయ్యవార్లు, రొయ్య రైతులు, రమణయ్య,దుగ్గినేని సురేష్ బాబు, మోదినేని వెంకటేశ్వర్లు, బ్త్తుల మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు.
Source : sakshi