For Advertisement Enquiries Please Contact +91 7901268899

రొయ్య రైతుకు కన్నీళ్లు

img

జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని విధంగా సాగిన  ఆక్వా సాగు ఇప్పుడు తిరోగమనంలో ఉంది.ప్రకృతి పగపట్టడం ఓ కారణమైతే , వచ్చిన ఉత్పత్తికి ధరలు  అందకపోవడం .. ఆక్వా సాగు పై పర్యవేక్షించాల్సిన శాఖలు సమన్వయం  చేయకపోవడం మరో కారణం . రొయ్య పిల్లల్లో  తగిన సామర్ధ్యం, నాణ్యత లేకపోవడం  జిల్లాలో ఆక్వా సాగుకు పెద్ద దెబ్బగా మారింది. ఏడాది కాలంలో రూ. 600 కోట్లకు పైగా పెట్టుబడులను ఈ కారణంగానే రైతులు నష్టపోయారు.
ఎంపెడా ... సీఏఏ … మత్స్యశాఖ ... ఎవరికీ పట్టదే!
ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన మత్స్య  శాఖలు పట్టీంచుకోవడం లేదు . క్షేత్రస్ధాయిలో  కీలకంగా వ్యవహరించాల్సిన మత్స్య శాఖ కగితాల లెక్కలకు... అనుమతుల విషయంలో క‌ఠినంగా వ్యవహరించాల్సిన సీఏఏ పట్టింపులేక... వీటిని నియంత్రించాల్సిన ఎంపెడా  పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్ర స్ధాయిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హేచరీలకు అనుమతుల నుంచి ఉత్పత్తి చేస్తున్న రొయ్య పిల్లలు , నాణ్యత , అమ్మకాలు ,నిర్వహణ అన్నిటిని  అఊర్తి స్ధాయిలో నియంత్రించాల్సిన సీఏఏ పెద్దగా ప్రభావం చూపడంలేదు . వార్షిక లెక్కలు, అనుమతుల నవీకరణకే పరిమితమవుతోంది. దీంతో జిల్లాలో హేచరీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే క్రమంలో సాగుకు కూడా పూర్తిస్ధాయిలో అనుమతులు తీసుకోవాల్సిన రైతులు అనధికారికంగా అవగాహన లేక రొయ్య పిల్లలు  కొనుగ్లుచేసినష్టపోతున్నారు. ఈ ప్రభావం జిల్లాలో ఏటా రూ. 600 నుంచి 1000 కోట్ల వరకు ఉంటుంది. 
తయారిలోనే నాసిరకం ....హేచరీల్లో తయారవ్తున్న రొయ్యపిల్లలు నాసిరకంగా ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 హేచరీలు ఉన్నాయి. కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ , వేటపాలెం , చినగంజాం ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. ఒక్కో పిల్లను కనీసం 10 నుంచి 12 రోజుల పాటు హేచరీలో ఉంచాలి కానీ జిల్లాలో సగటున 7 రోజులు మాత్రమే ఉంచుతున్నారు. త్వరగా పెరిగేందుకు ,పరిణామం కనిపించేందుకు వాటీని చిన్న దశలోనే కల్తీ చేస్తున్నారు.
ఆక్వా సాగులో కీలకమైన రొయ్యపిల్లల ఉత్పత్తి దశలోనే అడ్డదారులు తొక్కుతుండడంతో రైతుల చెరువుల్లోకి చేరే సరికి  రొయ్యలు నిర్జీవంగా మారుతున్నాయి. కొన్ని చోట్ల రొయ్యలు పెరుగుతున్నా తెల్ల మచ్చలు , ఎరుపు రంగు
రావడం, పరిమాణం చిన్నగా ఉండటంతో ఆశించిన ధర రావడం లేదు.
రూ. 600 కోట్ల పెట్టుబడులు ఆవిరి...
టంగుటూరు మండలం రావివారిపాలెం , పసకుదురు ,కొత్తపట్నం ,ఈతముక్కల, సింగరాయకొండ, చీనగంజాం ... ఈ ప్రాంతాల్లోని ఆక్వా రైతులు ఈ ఏడాది విపరీతంగానష్టపోయారు. ఉత్పత్తి చేసిన రొయ్యలను మార్కెట్ సమయంలో సిండికేట్ గా వ్యాపారులు ధరలు తగ్గిస్తుండటంతో ఆశించిన ధరలు రావడంలేదు. ఇది ఒక రకమైన కారణమైతే ... హేచరీల్లో రొయ్యపిల్లల్లో  నాణ్యత లేని కారణంగా అసలు ఉత్పత్తి ఉండడం లేదు.  ఇదే ప్రధాన కారణంగా మారుతోంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఈఏడాది వ్యవధిలోనే రూ. 600 కోట్లకు పైగా నష్టపోయినట్లు సమాచారం . ఈ నెలరోజుల వ్యవధిలో వేసిన రొయ్యలు మరణించడంతో  ఒక్క టంగుటూరు మండలం రావివారిపాలెం ,పసకుదురులోనే 13 మందిరైతులు రూ. 80 లక్షలకు పైగా నష్టపోతున్నారు.  కొన్ని చోట్ల రొయ్యలు బరువు తక్కువగా ఉంటున్నాయి. కిలోకు 50  రొయ్యలు తూగుతే మంచి పరిమాణం ఉన్నట్లు కాని ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న రొయ్యలు కిలోకు 120  రొయ్యలు కిలోకు 120 వరకు ఉంటూన్నాయి. దీంతో ధర రావడం లేదు. ఉత్పత్తి , పరిమాణం , ధర ఏదీ లేని కారణంగా రైతులకుదిక్కుతోచడంలేదు.
Source :eenadu
 

Languages

Shares

Related News