ఆంద్రప్రదేశ్ లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న రొయ్యలసాగుకు ఇప్పుడు యాంటీబయోటీక్స్ ముప్పు ముందుకొచ్చింది. రొయ్యల్లో యాంటీబయోటీక్స్ అవశేషాలు ఉన్నాయంటూ గడిచిన నెలరోజుల్లో దాదాపు 11 కంటైనర్లను యూరప్ దేశాల నుంచి వెనక్కితిప్పి పంపారు.దీనివల్ల ఎగుమతిదారులు రూ. 10 కోట్లకు పైగా నష్టపోయినట్టు చెబుతున్నారు.గడీచిన ఆరు నెలల్లో భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయిన రొయ్యల్లో యాంటీబయోటీక్స్ అవశేషాలు ఉన్నాయంటూ 52 కంటైనర్లు ఈ విధంగా వెనక్కి రావడం రైతుల్లో కలవరం పుట్టిస్తోంది. ఎగుమతి చేసిన వనామి రొయ్యల్లో నిషేధిత యాంటీబయోటీక్స్ అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడీ ధర దక్కక , మార్కెట్ లేక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళ వ్యక్తమవుతోంది.
యూరప్ ప్రమాణాలకు సరిపోక...
రొయ్యల్లో యాంటీబయోటీక్స్ అవశేషాలపై ఏపీలో చేస్తున్న పరీక్షలు యూరప్ దేశాల్లో చేస్తున్న నానో టెక్నాలజీ పరీక్షల ప్రమాణాలకు సరిపోవడం లేదని తెలుస్తోంది. అమెరికా , జపాన్, ఆస్ట్రేలియా, ధాయలాండ్ , జర్మనీ, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల్లో 45 శాతం ఏపీ నుంచి ఉంటున్నాయి.సాగులో అన్ని దశల్లోనూ యాంటీబయోటీక్స్ వినియోగం వల్ల సమస్య జటిలం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. సీడ్ దశ నుంచే ఈ అవశేషాలు కన్పిస్తున్నాయి. సీడ్ ట్యాంకుల విషయంలో శ్రద్ద తీసుకోకపోవడం, రొయ్యల సాగుకు ముందు శుభ్రం చేయడానికి పురుగు మందుల వినియోగం , రొయ్యలు స్టెరాయిడ్ తరహాలో మందులు వినియోగంతో సమస్య తీవ్రమైనట్టు నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో తీరప్రాంతం తో పాటు డెల్టాలో వరిచేల స్ధానంలోనూ రొయ్యల సాగు విస్తరించింది. గతంలో వైరస్ వచ్చి టైగర్ రొయ్యల సాగు ను తుడిచిపెట్టేసింది.మళ్లీ టైగర్ ర్రొయ్యల సాగు ఊపిరిపోసుకున్న దశలో యాంటీబయోటిక్స్ సమస్య దెబ్బతీసింది. ఇప్పుడు అదే సమస్య వనామి రొయ్యల్లోనూ తీవ్రమైంది. ఇదే విషయమై నాలుగేళ్ల క్రితం టైగర్ రొయ్యల దిగుమతులపై యూరప్ దేశాలు నిషేధం విధించాయి. అపట్లో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని గట్టి ప్రయత్నాలు చేయడం యూరప్ దేశాల నుంచి నిపుణులు దేశంలోపర్యటించి యాంటీబయోటీక్స్ సమస్య పరీశీలించారు. కొన్ని షరతులతో ఏపీ తదితర రాష్ట్రాల నుంచి టైగర్ ర్రొయ్యలకు అనుమతించారు. ఇప్పుడూ టైగర్ ర్రొయ్యల స్ధానంలో వనామీ రొయ్యల సాగు విస్తరించింది.వనామీకి యాంటీబయోటీక్స్ వినియోగంఎక్కువ అవుతుండటంతో నాలుగేళ్ల క్రితం టైగర్ ర్రొయ్యల దిగుమతి పై నిషేధం విధించిన యూరప్ దేశాలు ఇప్పుడు వనామీపైన వేటు వేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
Source : saskhi