రొయ్యల సాగు ప్రస్తుతం కష్టాల్లో పడింది . కరోనా మిగిల్చిన నష్టాల నుంచి రైతులు తేరుకోక ముందే ఒక్క సారిగా ధరలు పాతాళానికి పడిపోయాయి . గడిచిన వారం రోజుల వ్యవధిలో ఊహించని రీతిలో కేజీకి రూ .100 , టన్నుకు రూ .లక్ష తగ్గిపోయాయి .ఇదే సమయంలో తెల్ల మచ్చల వ్యాధి విజృంభించడంతో కనీసం పెట్టుబడి చేసేందుకు వీల్లేకుండా రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి . అప్పులు తెచ్చి రూ .లక్షల్లో పెట్టుబడులు పెట్టి రొయ్యల రైతులు ఏంచేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జిల్లాలో 65 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేపడుతున్నారు . గతేడాది వాతావరణం అనుకూలించడంతో పాటు ధరలు అనుకున్న స్థాయిలో ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున లాభాలు గడించారు . చిన్నా , చితకా రైతులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ ఏడాది పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు . ఈ సారి నష్టాలు చవిచూశారు . పరిస్ధితులు కాస్త అనూకూలించడంతో నష్టాల భర్తీ కోసం పెద్ద ఎత్తున సాగుకు ముందుకు వచ్చారు . మళ్ళి ధరలు పడిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు . ప్రస్తుత్తం విదేశాలకు ఎగుమతి చేసిన కంటైనర్లు దిగుమతి అక్కడ నిలిచిపోయింది . అక్కడి ప్రభుత్వాలు ప్రస్తుతం మన రొయ్యలను దిగుమతి చేసుకోవడాన్ని జాప్యం చేస్తున్నాయి . ఈ సమయంలో వైట్ స్పాట్ వ్యాధితో మార్కెట్ కు ఒకేసారి పెద్ద మొత్తంలో రావడంతో ధరలు తగ్గుతున్నాయి . రొయ్యల మార్కెటింగ్ అంతా ప్రైవేట్ వ్యక్తులు కంపెనీల చేతుల్లోనే ఉంది . దింతో వారు చెప్పిందే ధరగా మారిపోవడం , నాణ్యమైన విత్తనాల ఎంపిక చేసుకోకపోవడంతో వ్యాధి వ్యాప్తికి కారణం . దినికి మందులు లేకపోవడంతో రెండు , మూడు రోజుల్లోనే చెరువులను పెట్టుబడి చేయాల్సి ఉంటుంది . లేకుంటే చెరువుల్లో ఒక్క రొయ్య కూడా బతకదు .
source : eenadu