అసోం వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ చేపల్లో ఫార్మాలిన్ అవశేషాలు లేవని అధికారుల బృందం తేల్చింది. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అమ్మే చేపల్లో ఫార్మాలిన్ అవశేషాలు ఉన్నట్టు అక్కడి అధికారులు పదిరోజుల పాటు ఆంధ్రప్రదేశ్ చేపల దిగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్రం నుంచి మత్స్య శాఖ అదనపు సంచాలకులు కోటేశ్వరరావు తదితర అధికారుల బృందం అక్కడకు వెళ్లి పరీక్షలు నిర్వహించింది.
9 నమూనాల పరీక్ష
రాష్ట్ర బృందం .... సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ తయారు చెసిన ప్రత్యేక కిట్లను తీసుకెళ్లి చేపలను పరీక్షించింది. అసోం మత్స్య శాఖ డైరైక్టర్ దాస్, కార్యదర్శి రాకేశ్ కుమార్ ను కలిసి రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలనువివరించింది. అక్కడిఅధికారుల సమక్షంలోనే మెత్తం 9 నమూనాలను పరీక్షించారు. 8 నమూనాల్లోఎలాంటి అవశేషాలు లేవని తేలింది. మరో దానిలో మాత్రం నీర్ణీత వ్యవధి కంటే ఆలస్యంగా కాస్త రంగులో తేడా వచ్చింది. ఆలస్యంగా రంగు మారడం వల్ల దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసోం అధికారుల అనుమానాలను నివృత్తిచేశాక దిగుమతులు అనుమతించాలనిఅధికారులు కోరారు.అయితే నియంత్రణ అంశం అసోం కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఉండటంతో నిర్ణయం... వారు తీసుకోవాల్సి ఉంది పదిరోజులు నిషేధం ముగిసిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాలకు ప్రతి ఱోజు 250 టన్నుల వరకు చేపలు వెళ్తున్నాయి. దారిలో కంటెయినర్లను నిలిపివేసి ఫార్మాలిన్ కలుపుతున్నారనే ఊహగానా ఉన్నాయి . అయితే తాజా పరీక్షలతో అదేమీ లేదని నిర్ధరణ అయిందని మత్స్యశాఖ అదనపు డైరక్టర్ కోటేశ్వరరావు వివరించారు.
జిల్లాల వారీ బృందాలు ..
రాష్ట్రంలోనూ చేపల్లో ప్రమాదకర అవశేషాలను గుర్తించి కరినచర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి జిల్లాలోనూ మత్స్య శాఖ , పశుసంవర్ధక శాఖ , ఆహార భద్రతా విభాగం నుంచి ఒక్కొకరు చొప్పున ముగ్గురితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్య శాఖ ఎక్సఫిషియో కమిషనర్ రాం శంకర్నాయక్ వివరించారు. రైతులు, ట్రేడర్లు ,ఎగుమతిదారులకు అవ్గాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తామని , ప్యాకింగ్ కేంద్రాలపై నిఘా పెట్టామని చెప్పారు.
Source : eenadu