రాష్ట్రానికి అత్యంత ఆదాయాన్ని సంపాదించి పెడుతున్న వ్యవసాయ అనుబంధ రంగం చేపలు , రొయ్యల పెంపకం ఇప్పటి వరకు వ్యవసాయ అనుబంధ రంగంగా ఉన్నా దీన్ని కనీసం సేద్యంలా గుర్తించలేదు ఆక్వా రంగానికి జీవనాధారమైన నీటిని అందించడంతో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి . ఏటా వర్షా కాలంలో పెద్ద ఎత్తున నీరు వస్తున్నా , దాన్ని చెరువులకు మళ్లించే దిశగా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తుంది . ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్ధ ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రేకరించింది . దీనితో పాటు ఎగ్జిక్యూటీవ్ , టెక్నికల్ అడ్వైజరీ కమీటీలను , జిల్లా స్ధాయి అమలు కమీటీలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్ధకు రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్ గా పశుసంవర్ధక శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహించే ఈ కమిటీలో కో వైస్ చైర్మన్ గా ఆక్వా రంగ నిపుణున్ని ప్రభుత్వం నామినేట్ చేయనుంది . అధారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెంబర్ సెక్రటరీగా ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ తో సహా 24 మందిని సభ్యులుగా నియమించే విధంగా చర్యలు తీసుకున్నారు .
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం దేశానికే తలమానికం .లక్ష్యాల సాధనలో 125 శాతం ... వృద్ధి రేటులో 11 శాతం రికార్డులను నమోదు చేస్తూ తన సత్తాను చాటుకుంటుంది . కానీ క్షేత్ర స్ధాయిలో మాత్రం గత ప్రభుత్వాలు సాగు దారులకు సరియైన ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటుంది . ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న రొయ్యలు , చేపలకు ప్రాంతీయంగా మార్కెట్లు లేవు .ఉన్న అది కేవలం ఐదు శాతం లోపే . దీనివల్ల ఉత్పత్తిని మొత్తం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సిందే . రెట్టింపైన పెట్టుబడులు , తగ్గిపోయిన విస్తీర్ణం , ప్రకృతి వైపరీత్యాలు , నాణ్యత లేని సీడ్ కల్తీ మేత తదితర సమస్యలతో ఆక్వా సాగులో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది . నాలుగు దశాబ్దాలుగా ఆక్వా రంగంలో రాష్ట్రానికి దేశంలోనే 35 శాతం పైగా వాటా ఉండేది . మన రాష్ట్రంలో రొయ్యల సాగు 40 ఏళ్ల కిందటే పురుడు పోసుకుంది . వరి సాగుకంటే ఆక్వా సాగు లాభ సాటిగా ఉంటుందనే ఆశతో రైతులు వేలాది ఎకరాల వరి భూములను రొయ్యల చెరువులుగా మార్చేశారు . సముద్ర తీర ప్రాంతంలో , ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాల విస్టీర్ణం కలిగిన ఉప్పు నీటి కయ్యలుగా ఉన్న భూములుగా మారిపోయాయి .పదేళ్ళ క్రితం వరకు 30 నుంచి 50 వేల ఎకరాల మధ్యఉండే రొయ్యల చెరువులు ఈ పదేళ్లు 85 వేల ఎకరాల వరకు విస్తరించాయి .ఆక్వా రంగంలో ఆక్వా రైతు కంటే హేచరీ యజమానులు , ఫీడ్ మానుఫ్యాక్చరర్లు , టెక్నాలజీ సరఫరా సంస్ధలు , మందుల కంపెనీలు , ఎక్సపోర్టుర్లు లాభాలు ఆర్జిస్తున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగం పురోభివృద్ధి , రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అధారిటీ యాక్టు - 2020 ముసాయిదా కోసం రైతులతో చర్చించి తగు సూచనలు , సలహాలు తీసుకున్నది .
ఆక్వా రంగం సీడ్ , ఫీడ్ ప్రాసెసింగ్ , ఎగుమతులపై ఆధారపడి ఉందని , రాష్ట్రానికి ఎక్కువ సముద్ర తీరప్రాంతం ఉన్నదని , దాదాపు 9 జిల్లాల పరిధిలో ఈ సముద్ర తీర ప్రాంతంలో మెరైన్ ఉత్పత్తులకు మంచి అవకాశం ఉన్నాడని గుర్తించింది . ఆక్వా రంగంలో నిష్టాతులైన మేధావులతో , యూనివర్సటీ ప్రోఫెసర్లతో చర్చించి రూపకల్పన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్ధ ఏర్పాటు రాష్ట్ర ఆక్వా రంగ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం కాగలదు ఈ సంస్ధ ద్వారా రైతులకు భరోసా కల్పించేందుకు , నాణ్యత కలిగిన సీడ్ సరఫరా చేసేందుకు , సాగులో సాయం అందించేందుకు , ఆక్వా రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలిపేందుకు సంకల్పించడం అభినందనీయం .
source : sakshi