For Advertisement Enquiries Please Contact +91 7901268899

ఆక్వా ల్యాబ్స్ కు రిజిస్ర్టేషన్ తప్పనిసరి

img

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి  ఆక్వా ల్యాబ్ రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని కాకినాడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్  ఫిషరీష్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ పి. కోటేశ్వరరావు అన్నారు. ఆక్వా ల్యాబ్స్ రిజిస్ర్టేషన్ కోసం  దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ ల్యాబ్ లను పరిశీలించి అనుమతులను ఇచ్చేందుకు నెట్ వర్కింగ్ ఆక్వా ల్యాబ్ రిజిస్ర్టేషన్ బృందం సభ్యులు ఆదివారం విస్తృత్తంగా  పర్యటించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమ అభివృద్ధి , రైతుల సంక్షేమం  కోసం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రవేట్ఆక్వా ల్యాబ్ జీ ఓ నెం.49 ప్రకారం రిజిస్ర్టేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ర్టేషన్ చేయించుకున్న నెట్ వర్కింగ్ ఆక్వా ల్యాబ్ ఎస్ఐఎఫ్ టీ నోడల్ కేంద్రంగా పని చేస్తాయన్నారు. నెట్ వర్కింగ్ ఆక్వా ల్యాబ్ అనుసంధానంతో ల్యాంస్ నెల వారీ రిపోర్టింగ్ , డీసీజ్  సర్వేలైన్స్ ల్యాబ్ సిబ్బంది  రైతులకు అందిస్తున్న సేవలు, మొబైల్ ఆక్వా ల్యాబ్లపనితీరుపై నిఘూ ఉంటుంది. ప్రభుత్వ , ప్రైవేట్ ఆక్వా ల్యాబ్ లు ఒక  గొడుగు కిందకు తీసుకునిరావడంతో వివిధ ప్రాంతాలలో విజృంభిస్తున్న  వ్యాధులపై పర్యవేక్షణ  - నిఘా ఉంటుందన్నారు. రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో 10 , పశ్చిమ గోదావరిలో 35, కృష్ఱా జిల్లా 39, గుంటూరు 8, ప్రకాశం 12, నెల్లూరు27, విశాఖ , విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో 3 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయన్నారు

Languages

Shares

Related News