For Advertisement Enquiries Please Contact +91 7901268899

భారత్ కు వ్యాపించిన ధిలాపియా లేక్ వైరస్:

img

 చేపల సాగు ఉన్న దేశాలను ధిలాపియా లేక్ వైరస్ వణీస్తోంది. తాజాగా భారతదేశంలో కూడా వ్యాప్తి చెందినట్లు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అభివృద్ధి సంస్ధ అధికారులు ప్రకటించారు. ఈ వైరస్ విషయంలో ఆక్వారైతులను అప్రమత్తం చేయాలంటూ ఎంపెడా అధికారులను కేంద్రం ఆదేశించింది.ఇప్పటికే ఇజ్రాయుల్ , లాటిన్ అమెరికా , ఈక్విడార్, కొలంబో దేశాల్లో 80  శాతం నష్టం జరిగినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ధిలాపియాను సుమారు 2 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ధిలాపియా 3 రకాలు . ఇందులో బ్లాక్ ధిలాపియా పూర్వం నుంచి కొల్లేరులో లభ్యమయ్యేది. దీనికి పెద్దగా విలువ లేకపోవడంతో అమెరికాకు చెందిన రెడ్ ధిలాపియా రకాన్ని దిగుమతి చేసుకుని సాగు ప్రారంభించారు. కొంత కాలం కిందట ఎంపెడా ఫిలిపైన్స్ నుంచి గ్రేధిలాపియా రకాన్ని దిగుమతిచేసుకుని వాటిపిల్లల్ని ఉత్పత్తి చేసే కేంద్రం కృష్టాజిల్లా కంకిపాడులో ఏర్పాటు చేశారు.ప్రస్తుత్తం ఈ చేపలకు మంచిడిమాండ్ ఉండటంతో భవిషత్తులో మరింత అభివృద్ధి చేసే దిశగా ఎంపెడా కృషి చేస్తోంది. 
లక్షణాలు ఇవీ:

     ధిలాపియా చేపలపై పుండ్లు పడతాయి. మొప్పలు, పొసులు ఊడిపోతాయి.సాధారణంగా ఎర్రగా ఉండే చేప కళ్ళు తెల్లగా మారిపోతాయి మేత తినడం బాగా తగ్గిపోతుంది. కదలికలుతగ్గిపీయి చేపలు చెరువు అడుగుభాగంలోకి చేరతాయి.ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే చేపల నమూనాలను స్ధానిక ఎంపెడా కార్యాలయాలకు తీసుకెళ్లాలని భీమవరం ఎంపెడా ఏడీ డాక్టర్ పి. శ్రీనివాసులు సూచించారు. వాటిని తమిళనాడులోని రాజీవ్ గాంధీసెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ కు పరీక్షలకు పంపిస్తామన్నారు.
Source: eenadu
 

Languages

Shares

Related News