For Advertisement Enquiries Please Contact +91 7901268899

వెనామీ.. గట్టెక్కే దారేది ..!

img


రొయ్యలఎగుమతి తగ్గిపోయింది. ధరలు గణనీయంగా పడిపోయాయి.సాగు చేసిన రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడినట్టు అసలే సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ఆక్వా రంగం పై ఇప్పుడు కరోనా తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ఆక్వా రైతులను తీవ్రంగా కలవరానికి గురిచేస్తోంది. వెనామీ రొయ్య ఎగుమతులపై ప్రభావం పడటంతో ఆక్వా రంగంపై  నీలినిడలు కమ్ముకుంటున్నాయి. గత డిసెంబర్ లో గంపెడాశతో సాగు చేసిన రైతులకు కన్నీళ్లే మిగలనున్నాయి. ధరల పతనానికిఎలాంటి అవకాశం వచ్చినా సొమ్ము చేసుకునే వ్యాపారులు , మధ్యవర్తులు కరోనాను బూచిగా చూపుతూ ఒక్కసరిగా ధరలు తగ్గించేశారు.
కష్టాల కోర్చి కాపాడుకున్నప్పటికీ...
    జిల్లాలో విస్తారమైన సముద్ర తీరం ఉంది. టంగుటూరు , సింగారయకొండ , చినగంజాం చీరాల , ఉలవపాడు, గుడ్లూరు , కొత్తపట్నం, వేటపాలెం , ఒంగోలు మండలాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రొయ్యల చెరువులను సాగు చేస్తున్నారు. 1991 లో స్కాపీ, టైగర్ రొయ్యలు రైతులకు సిరులు కురిపించాయి. 2003 లో వెనామీ రొయ్య మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆక్వా సాగులో భారీ మార్పులోచ్చాయి. రొయ్య పిల్ల నాణ్యత విషయంలో ప్రభుత్వం కరినంగా వ్యవహరించడంతో మెర్టాలిటీ శాతం తగ్గి చెరువుల్లో బతుకుదల శాతం పెరిగింది. గత కొన్ని రోజులుగా వైట్ గట్ , వైట్ స్పాట్, విబ్రియోసిస్ వైరస్ లు రొయ్యల పై దాడి చేసినా రైతులు ఎన్నో ప్రయత్నాలు చేసి వాటిని బతికించుకున్నారు. వైరస్ ల దాటి నుంచి అధిక వ్యయప్రయాసలతో  వెనామీని కాపాడుకొస్తున్నప్పటికీ దిగుబడులు తగ్గడం , దీనికి తోడు ధరలు భారీగా పతనం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టన్నులు రూ. 60 వేల తగ్గుదల
    రొయ్యల ధరలు ఒక్కసారిగా పతనం అవ్వటం వెనుక అనేక కారణాలున్నాయి. డిసెంబరులో సాగు చేసిన పంట ప్రస్తుతం చేతికి వచ్చింది. ప్రతి సారి పంట చేతికొచ్చే సమయానికి ఎగుమతి దారులు కూటమి కట్టి రైతులను ఏదో ఒక విధంగా మోసం చేస్తుంటారు. ఈ సారి కరోనా సాకుగా మారింది. వాస్తవానికి  ప్రకాశం , నెల్లూరుతో సహా కోస్తా జిల్లాల్లో ఉత్పత్తయ్యే రొయ్యలు ఎక్కువ మేర యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రధానంగా అమెరికా , రష్యా,  ఆస్ట్రేలియా , ఫ్రాన్స్ , ఇటలీ స్పెయిన్ ,తదితర దేశాలకు సరకు రవాణా అవుతుంది. చెనాకు మాత్రం 90, 100 కౌంటు  రొయ్యలు ఎగుమతికి అవుతాయి. ప్రస్తుతం అన్నిదేశాల్లోనూ కరోనా భాధితులు బయటపడుతుండటంతో ఎగుమతులు తగ్గుపోయినట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు.వారం రోజుల క్రితం 50 కౌంటు రొయ్యలకు రూ. 340 ధర  చెల్లించగా , ప్రస్తుతం రూ. 280 కి పడిపోయింది. అదేవిధంగా 60 కౌంటు రొయ్యలు రూ. 320 లభించగా, ప్రస్తుతం రూ. 260 పలుకుతుంది. ఇలా ఒక్క సారిగా ధరలు పతనమవడం రైతుల్లో తీవ్ర అందోళన నెలకొంది. రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టి పట్టుబడిపట్టే నాధుడి కోసం రైతులు ఎదురుచుస్తునారు. వారం రోజుల వ్యవధిలో టన్నుకు సరాసరిన రూ.60 వేల తగ్గిపోయింది. 
source : Eenadu

Languages

Shares

Related News