రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్దికి విశాఖపట్నం , సూర్యలంకలో రూ. 106 కోట్లతో ఆక్వా పరిశోధన కేంద్రాలు , హేచరీలు నిర్మిస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో సిబా అధ్వర్యంలో రాష్ట్ర స్ధాయి ఆక్వా రైతుల సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటలో ఆక్వాటిక్ క్వారైంటన్ కేంద్రం , బ్రూడర్ మల్టిష్లికేషన్ కేంద్రం ,గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకంలో పీతలు ,పండుగప్పల హేచరీలునిర్మిస్తున్నామన్నారు. పనులను దిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు ఈ నెల 9 న రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
Source : eenadu