జనతా బజార్లలో ఆక్వా ఉత్పత్తులను విక్రయించేలా చూడాలని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు . గ్రేడింగ్ , ప్యాకింగ్ దశ కూడా గ్రామా స్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు . రైతుల వ్యవసాయ ఉత్పతులకు ఈ బజార్లు ద్వారా తగిన స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు లభించాలని .. కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోకొనసాగేలా చూడాలని ఆయనన్నారు .జనతా బజార్ల విధివిధానాలు .. అధికారుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు . సమీక్షలో ఆయన ఇంకా ఏమన్నారంటే ..
1.రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను జనతా బజార్ల లో విక్రయించేలా చూడాలి .
2 . కనీసం 20 -25 రకాల ఉత్పత్తులు వీటిల్లో అందుబాటులో ఉంచాలి .
3 . పళ్ళు , కూరగాయలు , గుడ్లు , పాలు , ఆక్వా ఉత్పత్తులు వంటి నిత్యావసరాలు లభించే ఈ బజార్లలో వీటి వినియోగం 30 - 35 శాతం ఉండాలి .
4 .ఇలా అయితే మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు మంచి ధరలు వఛ్చి లాభం చేకూరుతుంది .
5 . ఏడాది లోపు వీటిని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం .
6 .గ్రేడింగ్ , ప్యాకింగ్ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళాలి .
7 . ఈ బజార్ల ద్వారా రైతులకు మార్కెటింగ్ అవకాశాలు లభించాలి . అలాగే కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులో కొనసాగేలా చూడాలి .
8 . మార్కెట్లో ఉత్పత్తులు నిలవాలంటే గ్రేడింగ్ , ప్యాకింగ్ బాగుండాలి.
9 . సమావేశంలో చర్చించినా అంశాలతో విధివిధానాలు తయారు చేయాలి . మరింత మేధోమధనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలి .
ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నా బాబు , అగ్రికల్చర్ మిషన్ వై ఎస్ చైర్మన్ నాగి రెడ్డి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు
source : sakshi