For Advertisement Enquiries Please Contact +91 7901268899

వాటిని విడనాడితే ... ఆక్వా వాహ్వా !

img

కైకలూరు : ఆక్వా సాగులో నిషేధిత యాంటీబయాటిక్స్ వాడిన ఉత్పత్తులను విదేశాలు తిరస్కరిస్తున్నాయి . 2019 -2020 లో నిషేధిత యాంటీబయోటిక్స్ కోవిద్ కారణంగా 26 రకాల రొయ్యల ఉత్పత్తులను యునైటడ్ స్టేట్స్ ఫుట్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తిరస్కరించి ఆ కంటైనర్లను వెనక్కి పంపింది .రొయ్యల , చేపల సాగులో నిషేధిత క్లొరంఫెనికల్ , ఎన్రోప్లోక్సాసిస్, ఎరిత్రోమైసిన్ ఉపయోగిస్తుండటమే దీనికి కారణం .ఈ నేపథ్యంలో దేశంలో ఆక్వా సాగులో యాంటీబయోటిక్స్ వాడకాన్ని నియంత్రించేందుకు ఈ ఏడాది నవంబర్ 18 నుంచి 24 వరకు వరల్డ్ యాంటీమొక్రోబియల్ అవేర్నెస్ వీక్ ను నిర్వహించారు .ఏపీమత్స్య శాఖ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం కొనసాగింది . యాంటీబయోటిక్స్ నివారణపై ఆక్వా రైతులను చైతన్యం పరచడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం 
నిషేధిత రసాయనాలు అమ్మితే షాపుల లైసెన్స్ రద్దు 
నిషేధిత యాతేబయోటిక్స్ ను వాడకూడదని , రొయ్యల పట్టుబడికి   15 -20 రోజుల ముందు మందులు వాడకూడదని , వెటర్నరీ గ్రేడ్ మందులను ఎట్టి పరిస్ధితులోను ఆక్వా వినియోగించకూడదని రైతులను చెతన్య పరుస్తున్నారు . నేషనల్ రెసిడ్యుకంట్రోల్  ప్లాన్ , ఎలిసా పద్దతి ద్వారా ఎగుమతి ఉత్పత్తుల్లో ఎటువంటి అవశేషాలున్నాయో పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు . అలాగే మందుల తయారీదారులు యాంటీబయోటిక్స్ ను ఉపయోగించకూడదని , నిషేధిత మందులను వినియోగిస్తే .. షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ చట్టం - 2020 , ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ సవరణ చట్టం - 2020 ద్వారా నిషేధిత రసాయనాల నివారణకు కమిటీల ద్వారా రైతులను అవగాహన కల్పిస్తోంది . రాష్ట్రంలో రెండు క్వాలిటీకంట్రోల్ , ఏడూ ఎలిసా ల్యాబ్ లను ఏర్పాటు చేసింది . 
రక్త హీనత , పేగు సంబంధిత వ్యాధులు 
ఆక్వా సాగులో వ్యాధుల నివారణ , హేచరీలలో విత్తన అధికోత్పత్తి , చేపల సాగులో తాటాకు తెగులు , రెడ్ డిసీజ్ , తోక కుళ్లు, రొయ్యల సాగులో విబ్రియోసిస్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ ను రైతులు వాడుతున్నారు . సాధారణంగా 70 నుంచి 80 శాతం మందులు , రసాయనాలు సాగు చెరువులో ఉండిపోతున్నాయి .దీంతో బాక్టీరియా లైన విబ్రియో , సూడోమో నాస్, ఏరోమోనాస్ ,ఎడ్డెర్ట్ సియోలా వంటివి వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటున్నాయి  . యాంటీబయోటిక్స్ ఎక్కువ కలిగిన ఆక్వా ఉత్పత్తులను మనుషులు తీసుకుంటే రక్త క్షీణత , పేగు సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు .అలాగే రొయ్యలను దిగుమతి చేసుకునే అమెరికా , యూరోపియన్ యూనియన్లు ట్రేసీయబిలిటీపరీక్ష పద్ధతిని ఉపయోగిస్తున్నాయి . ఇందులో రొయ్యలు ఏ దేశంలో , ఏ గ్రామం నుంచి వచ్చాయి , ఎలాంటి మందులు వాడారు తదితర విషయాలన్నీ ఉంటాయి .భారతీయ ఆక్వా కల్చర్ రొయ్యల పరిశ్రమలో నిషేదిత యాంటీబయోటిక్స్ వాడకాన్ని తగ్గించడంలో విఫలమైందని దక్షిణ రొయ్యల కూటమి ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది . వ్యాధులు రాకుండా ముందుగా యాంటీబయోటిక్స్ ఉపయోగించడం ఏ మోతాదు ఎన్ని రోజులు వాడాలో రైతులకు తెలియకపోవడం వంటి కారణాలు నష్టాన్ని కలిగిస్తున్నాయి .

source : sakshi

Languages

Shares

Related News